Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకామారెడ్డి జిల్లాక్రైంజిల్లా వార్తలుతెలంగాణ

Nagireddypet : పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువలో పడి వృద్ధుడి మృతి..!

Nagireddypet : పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువలో పడి వృద్ధుడి మృతి..!

నాగిరెడ్డిపేట్, మన సాక్షి:

నాగిరెడ్డిపేట్ మండలంలోని గోపాల్ పేట్ గ్రామ సమీపంలోని పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తు కాలు జారిపడ్డ వృద్ధుడి లింగంపేట్ మండలంలోని ఎక్కపల్లి గ్రామానికి చెందిన తొర్రి కిషన్ (66) అనే వ్యక్తి మృతి చెందినట్లు స్థానిక ఎస్సై రాజు తెలిపారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఎక్కపల్లి గ్రామానికి చెందిన తొర్రి కిషన్ అతని కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలోని నల్ల పోచమ్మ ఆలయంలో మొక్కులు తీర్చుకోవడానికి వచ్చారు. ముందుగా పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ వద్ద వంటలు చేసుకొన్న అనంతరం అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.

శుక్రవారం రాత్రి పోచారం ప్రాజెక్టు ప్రధానకాల్వ వద్ద తొర్రి కిషన్ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి మద్యం మత్తులో ప్రమాదవశాత్తు కాలుజారి కాల్వ నీటిలో పడిపోగా, నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో కాలువలో మునిగిపోయాడన్నారు. అతని ఆచూకీ కోసం ప్రధాన కాలువలో గాలించినప్పటికీ ఆచూకీ తెలియలేదని, శనివారం ఉదయం ప్రధాన కాలువలో గాలించగా ఆయన శవం లభ్యమైనదన్నారు. మృతుని కుమారుడు నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.

ALSO READ : Gas Cylinders : రూ.500 గ్యాస్ సిలిండర్ పై ప్రభుత్వం మెలిక.. అందరికీ కష్టమే..!

మరిన్ని వార్తలు