Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : అన్నని చంపిన తమ్ముడు.. అరెస్ట్ రిమాండ్..!

Nalgonda : అన్నని చంపిన తమ్ముడు.. అరెస్ట్ రిమాండ్..!

శాలిగౌరారం, మనసాక్షి

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామంలో ఈ నెల 26వజరిగిన హత్య కేసు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్టు శాలిగౌరారం సిఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శాలిగౌరారం మండలం పెర్కకొండరాం కొండారం గ్రామానికి చెందిన చర్లపల్లి రాంబాబును అతని తమ్ముడు చర్లపల్లి నవీన్ ఇంటి స్థలం విషయం లో గొడవ పడి అన్న ను కత్తి పిటతో నరికి బండారయు తొ మోదీ హత్య చేసిన విషయం విదితమే.

మృతుడి తల్లి పద్మ పిర్యాదు మేరకు శాలిగౌరరం ఎస్ ఐ ఐలయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. బుధవారం నిందితుడు నవీన్ ను అదుపులో తీసుకుని విచారించగ మా అన్న ఇంటి స్థలం విషయం లో మొండికి వేయడంతో నీ హత్య చేసింట్లు అంగీకరించారని, నిందితున్ని రిమాండ్ కు పంపినట్లు శాలిగౌరారం సి ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఈ హత్య కేసును చెదించడంలో సహకరించిన నకిరేకల్, శాలిగౌరారం సి ఐ లు రాజశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, ఎస్ ఐ ఐలయ్య, పోలీస్ సిబ్బందిని నల్లగొండ డి ఎస్ పి శివరాంరెడ్డి అభినందించారు.

ALSO READ : BANDLA GANESH : కేటీఆర్ అమెరికా వెళ్ళింది అందుకే.. కేటీఆర్, రోజా పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..!

మరిన్ని వార్తలు