Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆదిలాబాద్జాతీయంతెలంగాణరాజకీయం

Modi : తెలంగాణలో రూ.6697 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన నరేంద్ర మోడీ..!

Modi : తెలంగాణలో రూ.6697 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన నరేంద్ర మోడీ..!

ఆదిలాబాద్, మన సాక్షి :

తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 6697 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. సోమవారం ఆయన ఢిల్లీ నుంచి నేరుగా తెలంగాణకు చేరుకున్నారు. ఆదిలాబాద్ లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ సౌందర్ రాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తోపాటు పలువురు నేతలు ఆయనకు స్వాగతం పలికారు.

అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వర్చువల్ గా అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. రామగుండంలో ఎన్టిపిసి రెండవ దశ విద్యుత్ ప్లాంటుకు ప్రారంభోత్సవం చేశారు. అంబారి – ఆదిలాబాద్ దింపాల కొట్టి రైల్వే విద్యుదీకరణ శంకుస్థాపన చేశారు. 6697 కోట్ల రూపాయలతో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేపట్టారు. ఆదిలాబాద్ – బేలా మహారాష్ట్ర రోడ్డు విస్తరణ పనులు, రైల్వే విద్యీకరణ మార్గాన్ని ప్రారంభించారు.

ALSO READ : Kcr : ఓటమిపై కేసీఆర్ కీలక ప్రకటన.. తెలంగాణ భవన్ సమావేశంలో వెల్లడి..!

మరిన్ని వార్తలు