Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : వర్షాలు లేవు.. మూడు నెలల పాటు ఉన్న నీటిమే వాడుకోవాలి..!

Nalgonda : వర్షాలు లేవు.. మూడు నెలల పాటు ఉన్న నీటిమే వాడుకోవాలి..!

తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలి –  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

నల్గొండ, మన సాక్షి:

ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు రాకుండా 3 నెలల పాటు మున్సిపల్, మిషన్ భగీరథ,ట్రాన్స్కో అధికారులు, కౌన్సిలర్లు బాధ్యతగా పనిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని బుధవారం ఆయన నల్గొండ మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరాలపై కౌన్సిలర్లు, అధికారులతో సమావేశమయ్యారు.

వర్షాలు లేక ఈ సంవత్సరం బోర్లన్ని ఎండిపోయాయని, 3 నెలలపాటు ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు .కర్ణాటకలో సైతం తాగునీటికి తీవ్ర సమస్య ఉందని, బెంగళూరు పట్టణంలో తాగు నీటి సమస్య ఉందని, కర్ణాటక నుండి తెలంగాణకు తాగునీటిని తీసుకువచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో త్వరలోనే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ పరిస్థితులలో మున్సిపల్ అధికారులు తాగునీటితో పాటు , శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. 25 సంవత్సరాలలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదని, అందువల్ల నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని అందరూ బాధ్యతగా పనిచేయాలని కోరారు. తాగునీటి సరఫరా విషయంలో నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఎన్ని ట్యాంకర్లు కావాలన్నా తెప్పిస్తామని, అదే సమయంలో తాగునీటిని వృధా చేయవద్దని, జాగ్రత్తగా వాడాలని, అవసరమైతే ముడి నీటిని కూడా సరఫరా చేస్తామన్నారు.

వేసవిలో విద్యుత్ సమస్య రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా సమస్యలు ఉన్నచోట తక్షణమే పరిష్కరించాలని, విద్యుత్ లైన్లు మార్చాల్సిన చోట, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర మెటీరియల్ అవసరమైతే బడ్జెట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఆయన విద్యుత్ అధికారులను ఆదేశించారు.

పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ కొన్ని వార్డులలో తాగునీటికి ఇబ్బందిగా ఉందని, పట్టణంలో రోజు మార్చి రోజు 20 నుండి 30 నిమిషాలు తాగు నీరు వస్తున్నదని, కొన్నిచోట్ల లీకేజీలు అవుతున్నాయని, వాటిని అరికట్టాలని కోరారు. జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన మాట్లాడుతూ తాగునీటికి సమస్యలు ఉంటే అవసరమైతే అదనపు ట్యాంకర్లను పంపించి తాగునీటిని సరఫరా చేస్తామని, అయితే తాగునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని, ప్రత్యేకించి తాగునీటిని వృధా చేయవద్దని, తోటలకు,గార్డెన్ కు, ఇల్లు శుభ్రం చేసుకునెందుకు, ఇతర పనులకు తాగునీటిని వాడవద్దని,వీటికి ముడి నీటిని సరఫరా చేస్తామని తెలిపారు.

అంతకుముందు మిషన్ భగీరథ ఎస్ ఈ వెంకటేశ్వర్లు జిల్లాలో ప్రస్తుతం తాగునీటి సరఫరా పై వివరించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డిఆర్ఓ డి. రాజ్యలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, ట్రాన్స్కో ఏస్ ఈ చంద్రమోహన్, ఆర్డిఓ రవికుమార్ ,మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, కౌన్సిలర్లు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

MOST READ: 

మరిన్ని వార్తలు