Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసిద్దిపేట జిల్లా

Telangana : విత్తనాల కోసం రైతుల కష్టాలు..!

Telangana : విత్తనాల కోసం రైతుల కష్టాలు..!

దుబ్బాక, మనసాక్షి :

వ్యవసాయ శాఖ అధికారుల అలసత్వం ప్రభుత్వం నిర్లక్ష్యము తెలియదు కానీ రైతులకు విత్తనాలు దొరకక అగ్రోస్ షాపుల ముందు రైతులు క్యూ లైన్ లో వేచి చూసిన విత్తనాల దొరకకపోవడంతో అన్నదాతలు ఆందోళన చేశారు.

మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతులు జిగులు పత్తి విత్తనాల కోసం రైతులు అగ్రోస్ దుకాణం ముందు క్యూ లైన్ లో వేచి చూసిన విత్తనాలు దొరకకపోవడంతో ఆగ్రహించిన రైతన్నలు కడుపు మంటతో దుకాణం ముందు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో రైతులు విత్తనాల కోసం కానీ ఎరువుల కోసం ఎదురుచూసిన దాఖలాలు లేవు అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.

మార్కెట్లో విత్తనాలు లేకపోవడంతో అసలే వర్షాకాలం ప్రారంభమైంది విత్తనాలు వేసుకునే సమయంలో రైతులకు విత్తనాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు మేలు జరగడం ఏమో తెలియదు కానీ పూర్తిస్థాయిలో ఇబ్బందులు అయితే కలుగుతున్నాయని అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు కావలసిన విత్తనాలను ఎరువులను అందుబాటులో ఉంచాలని లేనిపక్షంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి దాపురిస్తుందని అన్నారు. అంతేకాకుండా ఎద్దు ఏడ్చిన వ్యవసాయం…. సరిగా కొనసాగదని రైతు ఏడ్చిన రాజ్యము నిలబడదని…! విషయం అందరికి తెలిసిందే

ఇలానే రైతులను ఇబ్బంది పెడితే ఈ నీ ప్రభుత్వం కూడా కూలిపోతుందని అన్నారు. చూడాలి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు చేస్తున్నారు.

ALSO READ :

Miryalaguda : మిర్యాలగూడలో ఫోటో స్టూడియోలో చోరీ.. (వీడియో)

మరిన్ని వార్తలు