Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు.. గంజాయి పై ఉక్కు పాదం..!

Miryalaguda : శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు.. గంజాయి పై ఉక్కు పాదం..!

మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు

మన సాక్షి , మిర్యాలగూడ :

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ డిఎస్పీ కె.రాజశేఖర్ రాజు హెచ్చరించారు. మంగళవారం స్థానిక పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంటు, మండలి ఎన్నికల అనంతరం ఆకతాయిలను అదుపు, గంజాయి, గుట్కా విక్రయాలపై దృష్టి సారిస్తామన్నారు. గత కొన్ని రోజుల క్రితం మిర్యాలగూడ రోడ్లపై ఆకతాయిలు కొట్టుకోవడం వెనుక రౌడీ షీటర్లున్నారని గమణించామని వారిపై 3 కేసులు నమోదు చేశామని తెలిపారు.

రౌడీ షీటర్ల పై ప్రత్యేక టీములతో శోధన చేస్తున్నామని గంజాయి రవాణా చేసినా, అమ్మినా, సేవించినా వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని, కఠిన శిక్షలు పడేలా చేస్తామని ఆయన చెప్పారు. గంజాయి పై ఉక్కు పాదం మోపనున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న రౌడీ షీటర్లు గొడవలకు దిగితే పిడి యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. పట్టణంలో రాత్రి 11 గంటల అనంతరం దుకాణాలు, హోటల్స్, టీ మూసి వేయాలని కోరనున్నట్లు తెలిపారు.

త్వరలోనే కళాశాలలు, పాఠశాలల పునఃప్రారంభం అవుతున్నాయని ఈవ్ టీజింగ్, మహిళలను వేధించే వారిపై నిఘా పెట్టనున్నామని తెలిపారు. ప్రధాన రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాగానే ట్రాఫిక్ మెరుగు పరచడానికి చర్యలు తీసుకుంటామని, దుకాణదారులు, తీసుకోవాలని ఫుట్ పాత్ దుకాణదారులు రోడ్డు పై రాకుండా హద్దులు పెడతామన్నారు. అదే విధంగా నార్కట్పల్లి- అద్దంకి, కోదాడ – జడ్చర్ల జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా ఆక్సిడెంట్ జొన్లను గుర్తించి స్పీడ్ బ్రేకర్స్, స్టికర్స్ అతికించి తగుజాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.

పోలీస్ చట్టాన్ని, శాంతిభద్రతలను పకడ్బందీగా అమలు పరచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.
సమావేశంలో మిర్యాలగూడ ఒన్, టూ టౌన్, రూరల్ సిఐలు జి.సుధాకర్, పి.నాగార్జున, కె. వీరబాబు, ఎస్ఐలు నగేష్. శీనునాయక్, రాంబాబు, శేఖర్, విజయ్ కుమార్, శోభన్ బాబు, ఇరుగు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Cm Revanth : సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి ఎందుకు వెళ్లడం లేదు.. కారణం అదేనా..?

BIG BREAKING : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు.. ధర్మల్ ప్లాంట్స్ పై విచారణ..!

Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!

మరిన్ని వార్తలు