Cm Revanth : సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి ఎందుకు వెళ్లడం లేదు.. కారణం అదేనా..?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సచివాలయానికి దూరంగా ఉంటున్నారనే విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Cm Revanth : సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి ఎందుకు వెళ్లడం లేదు.. కారణం అదేనా..?

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సచివాలయానికి దూరంగా ఉంటున్నారనే విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్లకుండానే రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటనేది కూడా ఆలోచిస్తున్నారు. ఈ విషయం నిజమేనా అంటే అవునని చెప్పవచ్చును.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొద్దిరోజులుగా ముఖ్యమైన సమీక్షలను బంజరహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే కొద్ది రోజులుగా మీటింగులు మినహా సమీక్ష సమావేశాలు సీఎం నివాసం నుండి లేదా ఐసిసిసి నుండి చేస్తున్నారు. ఇక సోమవారం కూడా రివ్యూ జరిగిన తర్వాత ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి రవీంద్ర భారతి వరకు వచ్చిన ముఖ్యమంత్రి సచివాలయానికి కూడా వెళ్లకుండా వెను తిరిగి వ్యవసాయంపై ఐసీసీసీ కి వెళ్లి రివ్వు నిర్వహించారు. మొత్తానికి రేవంత్ రెడ్డి సచివాలయానికి ఎందుకు వెళ్లడం లేదని చర్చినీయాంశంగా మారింది.

వాస్తు మార్పులు :

వారం రోజుల క్రితమే తెలంగాణ సచివాలయంలో మార్పులు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగానే సీఎం కాన్వాయ్ ఎంట్రీ ప్రధాన ద్వారం కూడా మార్చబోతున్నారని ప్రచారం జరుగుతుంది. కాన్వాయ్ లోపలికి వెళ్ళేది.. బయటకు వెళ్ళేది ప్రధాన ద్వారాలను మార్చనున్నట్లు సమాచారం. అందులో భాగంగానే సచివాలయ సింహద్వారం ముందు గేటును మూసివేశారని పేర్కొంటున్నారు.

రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తనదైన శైలిలో మార్పు చేరుకులను శ్రీకారం చుట్టనున్నారు. పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి నియామకం అయిన తర్వాత కూడా గాంధీభవన్ లో కూడా మార్పులు చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ముఖ్యమంత్రి అయ్యాక కూడా సచివాలయంలో వాస్తు ప్రకారం మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలిసింది. ఆ మార్పులు చేసేందుకు గాను ప్రస్తుతం ఆయన సచివాలయానికి వెళ్లి రివ్యూ చేయడం లేదని సమాచారం.

ALSO READ : 

NDA : ఎన్డీఏ ఏపీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు.. అహంకారం కూలిపోయిందంటూ సంచలన కామెంట్..!

BREAKING : దేశవ్యాప్తంగా పేదలకు నరేంద్ర మోడీ గుడ్ న్యూస్.. మంత్రివర్గంలో ఆమోదం..!

Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!

Modi Cabinet : చిన్న రాష్ట్రం.. గెలిచింది అయిదుగురు, ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు.. ఎందుకో తెలుసా..?