Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణ

BRS : గులాబి బాస్ స్థానం ఆతడిదేనా.. పార్టీలో అంతర్మథనం..!

BRS : గులాబి బాస్ స్థానం ఆతడిదేనా.. పార్టీలో అంతర్మథనం..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో 9 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ (బీఆర్ఎస్) అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా చతికిలబడి పోయింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని గులాబీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఊహించి ఉండకపోవచ్చును. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడిన గులాబీ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో కొంతమేరకు ఊపు తీసుకురావడానికి అన్ని స్థానాల్లో పోటీ చేసింది. 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయగా 14 స్థానాల్లో మూడో స్థానంలోకి వెళ్లిపోయింది. దాంతో ఆ పార్టీ మరింత డీలపడింది.

 

కాగా బీఆర్ఎస్ పార్టీ పగ్గాలను వేరే ఎవరికైనా అప్పగించి తాను గౌరవ అధ్యక్షుడిగా కొనసాగేందుకు గులాబీ బాస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.. ముందుగా కేటీఆర్ ను కానీ కవితను గాని పార్టీ అధ్యక్షుడిగా పెట్టాలని భావించినట్లు సమాచారం. కాగా కేటీఆర్ ప్రస్తుతం ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇక కవిత తీహార్ జైల్లో లిక్కర్ కుంభకోణం విషయంపై ఆమె జైల్లో ఉన్నారు. వారిని గులాబీ పార్టీకి అధ్యక్షులుగా చేయటం కుదిరే అవకాశాలు కనిపించడం లేవు. దాంతో మరెవరిని నియమించాలని ఆ పార్టీలో అంతర్మదనం మొదలైంది.

 

బీఆర్ఎస్ కు , తనకు మొదటి నుంచి వెన్నంటి ఉన్న తన మేనల్లుడు హరీష్ రావును అధ్యక్ష పదవిగా నియమించి తాను గౌరవాధ్యక్షుడుగా కొనసాగాలని భావించినట్లు సమాచారం. అదేవిధంగా అధ్యక్ష పదవికి హరీష్ రావు తో పాటు బీఎస్పీని వీడి బిఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కూడా అధ్యక్ష పదవిగా నియమించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలో బిఎస్పిని బలోపేతం చేయడానికి బాగా కృషి చేశారని, అంతేకాకుండా దళిత సీఎం నినాదంతో మొదటిసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ దళితుల ఓట్లను బాగా పోగు చేసుకున్న విషయం తెలిసిందే.

 

ఆ తర్వాత రెండవ సారి కూడా అధికారంలోకి రావడానికి దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. అదేవిధంగా ఈసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అధ్యక్ష పదవికి నియమిస్తే దళిత బహుజన బీఆర్ఎస్ గా ప్రజల్లోకి వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా మరి కొద్ది రోజుల్లో బీఆర్ఎస్ కు కొత్త బాస్ ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కొత్త బాస్ వచ్చాకనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

 

ALSO READ : 

WhatsApp : వాట్సాప్ లో ఆ పేరుతో ఏదైనా లింకు వచ్చిందా.. క్లిక్ చేశారో..!

BREAKING : మిర్యాలగూడలో గంజాయి విక్రయిస్తున్న 12మంది అరెస్ట్.. తండ్రి కొడుకులే సూత్రధారులు..!

WhatsApp : వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ లు చూడొచ్చు.. చాలా ఈజీ ఇది అందరికీ తెలియదు..!

Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీకి విధి విధానాలు సిద్ధం, సర్వత్ర చర్చ..!

మరిన్ని వార్తలు