Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండహైదరాబాద్
Miryalaguda: మిర్యాలగూడ, దేవరకొండతో సహా 15 రెవిన్యూ డివిజన్లకు సబ్ కలెక్టర్ హోదా..!
Miryalaguda: మిర్యాలగూడ, దేవరకొండతో సహా 15 రెవిన్యూ డివిజన్లకు సబ్ కలెక్టర్ హోదా..!
మిర్యాలగూడ, మన సాక్షి:
నల్గొండ జిల్లాలో దేవరకొండ, మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్లకు సబ్ కలెక్టర్ హోదాను ప్రభుత్వం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 15 రెవెన్యూ డివిజన్లకు సబ్ కలెక్టర్లను నియమించే హోదాను కల్పించింది. పరిపాలన సౌలభ్యం కోసం ఆయా డివిజన్లలో ఐఏఎస్ అధికారులను నియమించనున్నారు.
సబ్ కలెక్టర్ల హోదా కల్పించిన రెవిన్యూ డివిజన్లలో
ఉట్నూర్, భద్రాచలం, కాటారం, కామారెడ్డి, బాన్స్ వాడ, కల్లూరు, కాగజ్ నగర్, బెల్లంపల్లి, అచ్చంపేట, మిర్యాలగూడ, దేవరకొండ, బైంసా, బోధన్, నారాయణ ఖేడ్, తాండూరు లకు సబ్ కలెక్టర్ ల నియామించనున్నారు.
ALSO READ :
Mission Bhagiratha : ప్రత్యేక యాప్ లో మిషన్ భగీరథ వివరాల నమోదు, గ్రామాలలో ప్రత్యేక సర్వే..!









