Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Suicide : కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య..!

Suicide : కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య..!

హైదరాబాద్, మన సాక్షి :

కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆయన భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది.హైదరాబాదులోని ఆల్వాల్ లో పంచశీల కాలనీలో నివాసం ఉంటున్న వారు ఆమె ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు.

రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియ రాలేదు. ఎమ్మెల్యే దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె రెండు రోజులుగా పాఠశాలకు కూడా వెళ్లడం లేదని తెలిసింది. కాగా ఎమ్మెల్యే ఉదయమే నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. సాయంత్రం తిరిగి వచ్చేవరకు ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

ALSO READ : 

Mission Bhagiratha : ప్రత్యేక యాప్ లో మిషన్ భగీరథ వివరాల నమోదు, గ్రామాలలో ప్రత్యేక సర్వే..!

Nithish Kumar Reddy: జాక్ పాట్ కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి.. టీమిండియాలో చోటు..!

మరిన్ని వార్తలు