Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Telangana : తెలంగాణ మంత్రివర్గం విస్తరణకు కసరత్తు.. రాజగోపాల్ రెడ్డికి చోటు..?

Telangana : తెలంగాణ మంత్రివర్గం విస్తరణకు కసరత్తు.. రాజగోపాల్ రెడ్డికి చోటు..?

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో మంత్రివర్గం విస్తరణ చేపట్టనున్నారు. తెలంగాణలో మంత్రి మండలిలో కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. కాగా మంత్రివర్గ విస్తరణలో మరికొంతమందికి చోటు కల్పించే అవకాశాలు కల్పి స్తున్నారు. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు నిర్వహిస్తున్నారని చెప్పవచ్చును.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే కీలక శాఖలు విద్యా, హోం, గనులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖలు ఉన్నాయి. కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకొని వారికి కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

పార్లమెంట్ ఎన్నికల అనంతరం మంత్రిమండలి విస్తరణ ఉంటుందని పలువురు సీనియర్ నేతలు పేర్కొ న్నారు. ఇది ఇలా ఉండగా పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిశాయి. దాంతో మంత్రి మండల విస్తరణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు హైకమాండ్ కూడా మంత్రివర్గం విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా రేవంత్ రెడ్డి తన టీం లో ఎవరిని నియమిస్తారు అనేది చర్చనీ అంశంగా ఉంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఛాన్స్ వస్తుందని రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతుంది. ఆయన మునుగోడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రివర్గంలోనే ప్రస్తుతం కొనసాగుతున్నారు. కాగా ఇద్దరి సోదరులకు కూడా మంత్రివర్గంలో చోటు లభిస్తుందా..? లేదా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. కానీ ఏది ఏమైనా రాజగోపాల్ రెడ్డి మాత్రం మొదటి నుంచి మంత్రి కావాలని భావిస్తున్నట్లు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా వారితోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి కూడా మంత్రిమండలిలో బెర్త్ ఖరారైనట్లుగా పలువురు పేర్కొంటున్నారు. అంతే కాకుండా రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి పేరు మహబూబ్ నగర్ జిల్లా నుంచి శ్రీహరి పేరు వినిపిస్తున్నాయి.

అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించి స్పీకర్ గా మరో వ్యక్తిని నియమిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని ఊహాగానాలు వినవస్తున్నాయి. ఏదేమైనా మంత్రివర్గంలో మరో ఆరుగురికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.

ALSO READ : 

బిగ్ బ్రేకింగ్ : తాడేపల్లిలో వైసిపి కార్యాలయం కూల్చివేత..!

Miryalaguda: రైస్ మిల్లుల్లో పొల్యూషన్ అధికారుల తనిఖీలు..!

మరిన్ని వార్తలు