బిగ్ బ్రేకింగ్ : తాడేపల్లిలో వైసిపి కార్యాలయం కూల్చివేత..!

ఆంధ్ర ప్రదేశ్ లోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేశారు. శనివారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో కూల్చివేతను ప్రారంభించారు.

బిగ్ బ్రేకింగ్ : తాడేపల్లిలో వైసిపి కార్యాలయం కూల్చివేత..!

మన సాక్షి :

ఆంధ్ర ప్రదేశ్ లోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేశారు. శనివారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో కూల్చివేతను ప్రారంభించారు. ప్రోక్లైన్లతో భవనం కూల్చివేశారు. కూల్చివేతకు సి ఆర్ టి ఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ సవాల్ చేస్తూ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించింది వైయస్సార్ సిపి.

సి ఆర్ టి ఏ కమిషనర్ కు హైకోర్టు ఆదేశాలను తెలియజేశారు వైయస్సార్ సిపి న్యాయవాది. అయినా కూడా తాడేపల్లి లో నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చివేశారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ కూల్చివేస్తున్నారని హైకోర్టును ఆశ్రయిస్తామని వైఎస్ఆర్సిపి నాయకులు పేర్కొంటున్నారు.

ALSO READ : 

BIG BREAKING : రైతులను రుణ విముక్తులను చేస్తాం.. కట్ ఆఫ్ డేట్ ఇదే..! రేవంత్ ప్రకటన..!

Miryalaguda: రైస్ మిల్లుల్లో పొల్యూషన్ అధికారుల తనిఖీలు..!