Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం

Cm Revanth Reddy: నన్ను తప్పించండి.. సోనియా, రాహుల్ గాంధీలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి..!

Cm Revanth Reddy: నన్ను తప్పించండి.. సోనియా, రాహుల్ గాంధీలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి..!

మనసాక్షి :

రేవంత్ రెడ్డి అంటే ఒక అంబాసిడర్.. కాసితో పనిచేసే వ్యక్తి .. అనుకున్నది సాధించే వరకు నిద్రపోడు.. అని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. కొడంగల్ లో ఎమ్మెల్యేగా ఓటమి చెందిన రేవంత్ రెడ్డి సరిగ్గా ఐదేళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాంటి వ్యక్తి నన్ను తప్పించండి అని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ, ఖర్గే కు విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ని ఢీకొట్టే సత్తా రేవంత్ రెడ్డికి లేదని కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఎందరో అన్నారు. అయినా కూడా రేవంత్ రెడ్డి సవాల్ చేసి మరి గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అదిష్టించారు.తనను తప్పించమని విజ్ఞప్తి చేసింది దేనికో తెలుసా..

ఆయన పిసిసిగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తవుతుంది. పీసీసీ నిబంధనల ప్రకారం ఆ పదవి మూడేళ్ల పాటు మాత్రమే ఉంటుంది. అధిష్టానం నిర్ణయం ప్రకారం మళ్లీ పెంచే అవకాశం కూడా ఉంటుంది. కానీ తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నందున పిసిసి అధ్యక్ష పదవి వేరే వారికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఈ విషయాన్ని తానే ఢిల్లీలో స్వయంగా మీడియాకు చెప్పారు. మంత్రివర్గ విస్తరణ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు తన మంత్రివర్గంలో అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారని, ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఏమీ లేదని, ఆ విషయంపై అధిష్టానాన్ని కలవలేదని తాను కేవలం పిసిసి అధ్యక్షుడిని కొత్తవారిని నియమించాలని ఉద్దేశంతోటే అధిష్టానం కలిసినట్టు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే పిసిసి అధ్యక్షుడిని మారుస్తారని ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత వెంటనే పార్లమెంటు ఎన్నికలు రావడం ఆయననే కొనసాగించారు. కాగా ఇప్పుడు మూడేళ్లు పూర్తి కావస్తున్నందున కొత్తగా పిసిసి చీఫ్ ను నియమించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి పీసీసీ చీఫ్ గా అధిష్టానం బీసీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని నియమించే అవకాశాలు ఉన్నాయి.

ALSO READ : 

TGSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ సమస్య ఉండదు..!

BREAKING : ముందస్తు సెలవు లేకుండా పాఠశాలకు గైర్హాజరైతే సస్పెండ్.. ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ వార్నింగ్..!

Success Story : క్యాటరింగ్ వర్కర్ నుంచి.. అసిస్టెంట్ ఇంజనీర్ గా కొలువు, సక్సెస్ కు సింబల్ గా మారిన యువకుడు..!

మరిన్ని వార్తలు