Success Story : క్యాటరింగ్ వర్కర్ నుంచి.. అసిస్టెంట్ ఇంజనీర్ గా కొలువు, సక్సెస్ కు సింబల్ గా మారిన యువకుడు..!

రెక్కలు ఆడిస్తేనే... కడుపు నిండే పేద కుటుంబమది. అక్షరమే భవిష్యత్తును మారుస్తుందని నమ్మిన ఆ యువకుడు... క్యాటరింగ్, వ్యవసాయ కూలీగా పని చేసి వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఆర్థిక కష్టాలను పక్కన పెట్టేసి లక్ష్యం వైపే అడుగులు వేసి ప్రభుత్వ కొలువు సాధించి సక్సెస్ కు సింబల్ గా మారిండు.

Success Story : క్యాటరింగ్ వర్కర్ నుంచి.. అసిస్టెంట్ ఇంజనీర్ గా కొలువు, సక్సెస్ కు సింబల్ గా మారిన యువకుడు..!

మిర్యాలగూడ. మన సాక్షి:

రెక్కలు ఆడిస్తేనే… కడుపు నిండే పేద కుటుంబమది. అక్షరమే భవిష్యత్తును మారుస్తుందని నమ్మిన ఆ యువకుడు… క్యాటరింగ్, వ్యవసాయ కూలీగా పని చేసి వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఆర్థిక కష్టాలను పక్కన పెట్టేసి లక్ష్యం వైపే అడుగులు వేసి ప్రభుత్వ కొలువు సాధించి సక్సెస్ కు సింబల్ గా మారిండు.

యువత గంజాయి, ప్రేమ పేరిట … దారి తప్పుతూ లక్ష్యమనేది లేకుండా… పౌర సమాజానికి ఇబ్బందికరంగా మారడంతో పాటు కుటుంబ వేదనకు కారణవుతున్న తరుణంలో… ఆరేళ్ల ప్రాయంలో తండ్రిని కోల్పోయిన… చెడు స్నేహాలకు.. చెడ్డ అలవాట్లకు బానిస కాకుండా అమ్మ తమ కోసం పడుతున్న కష్టాన్ని గుర్తించిన ఆ యువకుడు ఆమె స్పూర్తితో నిత్యం తన గమ్యం వైపు శ్రమిస్తూ మూడేళ్ల క్రితం పంచాయతీ కార్యదర్శిగా కొలువును సాధించాడు.

ఆ యువకుడు… విధులను నిర్వర్తిస్తూనే …ఆరు నెలల నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్ట్ కు సిద్ధమై ఈనెల 25న విడుదలైన పరీక్షా ఫలితాల్లో సెలక్టయ్యి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుండు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామ వాసి పోలేపల్లి
ప్రసాద్ మురారి.

క్యాటరింగ్ వర్కర్… వ్యవసాయ కూలీ పనులకు…

మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన పోలేపల్లి రామయ్య, ముత్యాలమ్మ దంపతులకు నలుగురు సంతానం. అందులో ఇద్దరు ఆడపిల్లలు కాగా.. మరో ఇద్దరు మగ సంతానం. ఉన్నారు. అయితే ప్రసాద్ మురారీకి ఆరేళ్లు ఉన్న వేళ తండ్రి మరణించారు. ఈ తరుణంలో తల్లి వ్యవసాయ కూలి పనులకు వెళ్తూ చదివిస్తున్న విషయాన్ని ప్రారంభంలోనే గుర్తించిన మురారి ప్రసాద్ క్యాటరింగ్ కు వెళ్తూ.. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లేది.

నల్గొండ రామగిరి ప్రభుత్వ స్కూల్లో టెన్త్ పరీక్షల్లో సత్తా చాటగా మిర్యాలగూడ పట్టణంలో ఓ ప్రైవేట్ కాలేజీ ఫీజు లేకుండా ఇంటర్మీడియట్ చదివేందుకు అవకాశం కల్పించింది. మొదటి నుంచి చదువులో టాప్ స్టూడెంటైన మురారి ప్రసాద్ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో మెకానిల్ విభాగంలో బీటెక్ చేయగా… గేట్ రాసి ఉస్మానియాలో ఎంటెక్ చేసిండు.

చదువయ్యాక గ్రామ కార్యదర్శి కొలువు సాధించి .. మిర్యాలగూడ మండలం హట్యా తండాలో విధుల్లో చేరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీలో … డ్యూటీ లు చేస్తూనే ఇరిగేషన్ ( ఐ అండ్ క్యాడ్)విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్ట్ లకు ప్రిపేరై పరీక్ష రాసి ఉద్యోగం సాధించటం విశేషం.

తనలో ప్రతిభను గుర్తించి సహాయ సహకారాలు అందించి టీచర్ శ్రీలక్ష్మీ, గురుకుల అడిషనల్ సెక్రటరీ పార్వతి దేవి, ఏసీపి రాజమహేంద్ర నాయక్ కు కృతజ్ఞతలు చెప్పారు.

ALSO READ : 

Whatsspp : వాట్సాప్ లో అదిరిపోయే మెటా ఏఐ ఫీచర్.. తెలియని విషయాలు సెకండ్లలో తెలుసుకోవచ్చు..!

Mahalakshmi: ప్రతి మహిళకు నెలకు ₹2500 ఎప్పటినుంచంటే.. మీరు అర్హులేనా..?

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!