Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజాతీయంతెలంగాణ

LPG GAS : పేదలకు మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ ధరలు ఎంతంటే..?

LPG GAS : పేదలకు మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ ధరలు ఎంతంటే..?

మన సాక్షి:

కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు గుడ్ న్యూస్ తెలియజేసింది. 2024 జూలై 1వ తేదీ నుంచి 19 కేజీల ఎల్పీజి గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 30 రూపాయలు తగ్గించారు. కాగా నేటి నుంచి తగ్గిన ఎల్పీజి గ్యాస్ సిలిండర్ల ధరలు అమలులోకి వచ్చాయి. డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈరోజు ఎల్పీజి గ్యాస్ సిలిండర్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం…

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నేటి నుంచి కమర్షియల్ సిలిండర్ ధరను ₹30 తగ్గించడంతో ఢిల్లీలో ₹1646, హైదరాబాదులో 19 కేజీల ఎల్పిజి గ్యాస్ ధర 72 రూపాయలు తగ్గి రూ.1903.50, విజయవాడలో 32 రూపాయలు తగ్గి రూ.1832.50కు చేరింది. అదేవిధంగా కలకత్తాలో ₹1756, ముంబై ₹1598, చెన్నై ₹1809 గా ఉన్నాయి.

డొమెస్టిక్ సిలిండర్ల ధరలు :

14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కానీ ప్రధాన నగరాల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలు ఈ రోజు (2024 జూలై 1) విధంగా ఉన్నాయి. ఢిల్లీలో ₹ 803, హైదరాబాదులో ₹855, ఏపీలోని అమరావతి లో ₹844.50, ముంబైలో ₹802.50, కోల్ కతాలో ₹ 829 , చెన్నైలో 818.50 ఉంది. ఉజ్వల గ్యాస్ సిలిండర్ల లబ్ధిదారులకు 603 రూపాయలకే ఈ సిలిండర్ లభించనున్నది.

ALSO READ : 

T20 World Cup 2024 : టి20 వరల్డ్ కప్ లో.. విశ్వవిజేతగా భారత్..!

BREAKING : జిల్లా కలెక్టర్ ఉత్తర్వులపై మండిపడ్డ వైద్యులు, సిబ్బంది నిరసన.. సందర్శించిన అదనపు కలెక్టర్..!

మరిన్ని వార్తలు