Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

BREAKING : నల్గొండ డిసిసిబి కాంగ్రెస్ కైవసం.. చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం..!

BREAKING : నల్గొండ డిసిసిబి కాంగ్రెస్ కైవసం.. చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం..!

నల్లగొండ, మనసాక్షి.

ఉమ్మడి నల్గొండ డిసిసిబి చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ కు ఉన్న చైర్మన్ పదవి (గొంగిడి మహేందర్ రెడ్డి) ని ఇటీవల అవిశ్వాస తీర్మానం ద్వారా డైరెక్టర్లు తొలగించారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ఆ పదవిని కైవసం చేసుకుంది. డీసిసిబి చైర్మన్ గా కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మహేందర్ రెడ్డి పై 15 మంది డైరెక్టర్లు గతంలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగా అవిశ్వాస తీర్మానం నెగడంతో నేడు డిసిసిబి చైర్మన్ ఎన్నిక నిర్వహించారు.

ఈ ఎన్నికలో 15 మంది డైరెక్టర్లు హాజరు కాగా చైర్మన్ కోసం కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన వేకగ్రీవంగా చైర్మన్గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సీఈవో శంకరరావు ప్రకటించారు.అనంతరం రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నూతనంగా ఎన్నికైన చైర్మన్ తో పాటు సహకరించిన డైరెక్టర్లను సాలువలు పూలమాలతో ఘనంగా సన్మానించి అనంతరం మాట్లాడారు.?

రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని
రైతు రాజ్యం స్థాపించడమే తమ లక్ష్యం అన్నారు. డిసిసిబి అధ్యక్షుడిగా కుంభం శ్రీనివాస్ రెడ్డికి రైతులకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టం అన్నారు. నల్గొండ జిల్లాలో బత్తాయి రైతులతోపాటు, అన్ని రకాల పంటలు పండించే రైతులకు సేవ చేయవచ్చు అన్నారు. నల్గొండ డిసిసిబి చైర్మన్ కి అందరి సహకారం ఉంటుంది అన్నారు. పదవి ముఖ్యం కాదు. రైతులకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలి అన్నారు.

డిసిసిబి ద్వారా గతంలో వెయ్యికోట్ల విద్యా రుణాలు ఇవ్వడం జరిగిందనిదాన్ని అబిగమించాలని సూచించారు. ప్రస్తుతం 250కోట్ల రూపాయలతో బ్యాంకు నడుస్తుందని దానిని 300 కోట్ల తో ముందుకు తీసుకెళ్లాలి అని కోరారు.

ఆగస్టు 15 నుండి రైతులకు రెండు లక్షల రుణమాఫీకి సీఎం ఆదేశం ఉందని 30 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయనున్నాం అని తెలిపారు. గతంలో తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 70 వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసింది అని గుర్తు చేశారు.  గత ప్రభుత్వం చేసిన అప్పుఏడు లక్షల కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాం అన్నారు.

తెలంగాణ రైతులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది తెలిపారు. వచ్చే 4 ఏళ్లలో రైతులకు అండగా ఉంటాము అన్నారు రైతు రాజ్యమే ధ్యేయంగా నూతన డిసిసిబి అధ్యక్షులు కుంభం శ్రీనివాసరెడ్డి మంచిగా పనిచేయాలి అని కోరారు.

నూతన డిసి సి బి అధ్యక్ష్యులు కుంభం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతాం అని రోడ్లు భవనాలు, నీటిపారుదల శాఖల మంత్రి అందరి సహకారంతో జిల్లాలోని రైతులకు సేవలందిస్తాం అన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు నూతన చైర్మన్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.

ALSO READ : 

Viral : ఒకే ఇంటికి మూడోసారి చోరీకి వెళ్ళిన దొంగ.. బెడ్ రూమ్ లో దంపతులను నగ్నంగా చూసి.. చివరకు ఇలా..!

LPG GAS : పేదలకు మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ ధరలు ఎంతంటే..?

మరిన్ని వార్తలు