Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : మిర్యాలగూడలో కోడిపందాలపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్ట్..!

BREAKING : మిర్యాలగూడలో కోడిపందాలపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్ట్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో కోడిపందాలపై రూరల్ పోలీసులు దాడి నిర్వహించారు. బెట్టింగ్ లో పాల్గొన్న ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కోళ్లతోపాటు డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం..
మండలంలోని శ్రీనివాస్ నగర్ దుబ్బ తండ గ్రామ శివారులో గల గురుకుల పాఠశాల వెనకాల గల చెట్ల కింద కోడిపందాలు ఆడుతున్నారని తెలిసి సిబ్బందితో కలిసి వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా వారు అక్కడినుండి పారిపోతుండగా అందులో ముగ్గురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది.

అరెస్టు చేసిన వారిలో కటారి గోపికృష్ణ, మానిపాటి సుంకయ్య, ఎస్.కె బడే సాహెబ్ గా ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి ఒక కోడిపుంజు, నాలుగు మొబైల్ ఫోన్స్, నాలుగు బైకులు, ఒక ఆటో, 2900 రూపాయలు స్వాధీన పరుచుకోని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ALSO READ : 

 Suryapet : అమ్మా.. నేనే వస్తున్నా.. వికలాంగురాలు దగ్గరికి స్వయంగా వెళ్లి దరఖాస్తు స్వీకరించిన జిల్లా కలెక్టర్..! 

NALGONDA : లో వోల్టేజి సమస్యకు చెక్, హైదరాబాద్ తరహాలో నల్గొండ జిల్లాను అభివృద్ధి చేస్తా.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

Pavan Kalyan : జీతం వద్దు, దానికోసమే పని చేస్తా.. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం..!

మరిన్ని వార్తలు