Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Anganwadi : అంగన్ వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్..!

Anganwadi : అంగన్ వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్..!

జగిత్యాల జిల్లా ప్రతినిధి, (మన సాక్షి)

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో మేట్ పల్లి -4 అనే అంగన్ వాడి కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద్భంగా అంగని వాడి కేంద్రంలోని రికార్డులు పరిశీలించారు. భోజన నమోదు లు, టైం టేబుల్, భోజన మెనూ ఫుడ్, స్టాక్ అంతేకాకుండా అంగన్ వాడి లో ఇచ్చే గుడ్డు నాణ్యత ను స్వయంగా పరిశీలించారు.  ప్రి స్కూల్ పిల్లల హాజరు, గర్భిణిలు, బాలింతల హాజరు నమోదు లు , ఎన్ హెచ్ టి ఎస్ మొబైల్ యాప్ లో పరిశీలించారు.

అంతే కాకుండా అంగనీ వాడి కేంద్రములో ఉన్న పిల్లల , ఎత్తుల , బరువులు స్వయంగా పరిశీలించారు. ఎన్ హెచ్ టి ఎస్ మొబైల్ యాప్ లో లోప పోషణ ఉన్న పిల్లలు ఎవరు ఉన్నారో యాప్ లో చెక్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంగన్ వాడి కేంద్రాల్లో పిల్లల పెరుగుదల పర్యవేక్షణ నివేదికల గురించి అడిగారు. పిల్లల పెరుగుదల పర్యవేక్షణ ను క్రమంగా చేపట్టి ఖచ్చితమైన పిల్లల ఎత్తులు, బరువులు నమోదు చేయాలని సర్వే లోని తేడాలు ఉండరాదని అంగన్ వాడి టీచర్లను ఆదేశించారు.

గ్రామాలలో గ్రామ పంచాయితి సిబ్బంది అంగన్ వాడి కేంద్రాలను పర్యవేక్షణా చేపట్టి ప్రి స్కూల్ పిల్లల విద్య, పెరుగుదల పర్యవేక్షణ చేపట్టి , ఖచ్చితమైన నివేదికలు సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా సంక్షేమ అధికారి వాణి శ్రీ ,ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, తాసిల్దార్ , పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ మధు కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ALSO READ :

NARAYANPET : నారాయణపేట జిల్లాలో 30, 30 (ఎ) పోలీసు యాక్ట్ అమలు..!

Pavan Kalyan : జీతం వద్దు, దానికోసమే పని చేస్తా.. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం..!

మరిన్ని వార్తలు