Drugs : రాజేంద్రనగర్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఐదుగురు అరెస్టు, వారిలో ఇద్దరు నైజీరియన్లు..!
Drugs : రాజేంద్రనగర్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఐదుగురు అరెస్టు, వారిలో ఇద్దరు నైజీరియన్లు..!
శేరిలింగంపల్లి , మన సాక్షి :
డ్రగ్స్ విక్రయ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీసీపీ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. అరెస్టయిన వారిలో ఇద్దరు నైజీరియన్లు కూడా ఉన్నట్లు తెలిపారు.
రూ.35 లక్షల విలువైన 199 గ్రాముల కొకైన్‌తోపాటు, రెండు పాస్‌పోర్టులు, 10 ఫోన్లు, 2 బైకులను సీజ్ చేశామన్నారు. నిందితులను ఒనౌహా బ్లెస్సింగ్, అజీజ్ నోహీం, వెంక గౌతమ్, వరుణ్ కుమార్, మహ్మద్ షరీఫ్‌లుగా గుర్తించారు. పరారీలో ఉన్న ఇద్దరి గురించి సమాచారం ఇస్తే రూ.2 లక్షల రివార్డు ఇస్తామని డీసీపీ ప్రకటించారు. ఈ ముఠాలో 13 మంది సభ్యులు ఉన్నట్లు అనుమానిస్తున్నామన్నారు.
నిందితులను ఒనౌహా బ్లెస్సింగ్, అజీజ్ నోహీం, వెంక గౌతమ్, వరుణ్ కుమార్, మహ్మద్ షరీఫ్‌లుగా గుర్తించారు. పరారీలో ఉన్న ఇద్దరి గురించి సమాచారం ఇస్తే రూ.2 లక్షల రివార్డు ఇస్తామని డీసీపీ ప్రకటించారు. ‘‘ అనౌహా బ్లెస్సింగ్ ఇక్కడికి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తుంది. ఇప్పటి వరకు ఆమె 20సార్లు నైజీరియా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించాం.
ఆమె దగ్గర 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించాం. వారిలో ఆరుగురికి కొకైన్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. వీరిపైనా కేసులు నమోదు చేశాం. పాజిటివ్‌గా తేలిన వారిలో అమన్ ప్రీత్‌సింగ్, అంకిత్, ప్రసాద్, నిఖిల్ తదితరులు ఉన్నారు ’’ అని డీసీపీ వివరించారు.
ఇవి కూడా చదవండి :
మిర్యాలగూడ : 35 ఏళ్లగా నడుస్తున్న దారిని మూసేశారు.. దారిలో ముళ్ల కంపలు, చుట్టూపంట పొలాలు..!
TGSRTC : ప్రయాణికులకు TGSRTC మరో గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు ఏసీ బస్సులు..!









