Phc : పీహెచ్సీ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!
Phc : పీహెచ్సీ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!
జగిత్యాల జిల్లా ప్రతినిధి, (మన సాక్షి)
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అబరిపేట్ కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్
బి. సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓ పి. సేవలు, ఐపీ సేవలు ,రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్, ఐపీ, రికార్డ్స్ మెడికల్ ఫార్మసి ని కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రసూతి సేవలను, వైద్య సేవలను మెరుగు పరచాలని, డాక్టర్లు సమయ పాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. రోజుకు ఎన్ని ఓ.పి.లను చూస్తున్నారు, ఆసుపత్రిలో పేషెంట్లకు శుభ్రమైన త్రాగునీరు అందిస్తున్నారా అని తెలుసుకున్నారు.
సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధుల పట్ల అప్రమత్తమై పేషెంట్లకు ఇబ్బంది కలుగకుండా వైద్య సేవలు కల్పించాలని సూచించారు. చిన్నపిల్లలకు ఇంజక్షన్లు వస్తున్నాయా లేదా అని తెలుసుకున్నారు ప్రస్తుత గర్భిణీలకు నార్మల్ డెలివరీలు అయ్యేవిధంగా ప్రోత్సహించాలని తెలిపారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి శానిటేషన్ ఎప్పటికప్పుడు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీఓ మధుసుధన్,డిప్యూటీ డిఎంహెచ్వో , శ్రీనివాస్ఎమ్మార్వో, ఎంపీడీఓ, డి పి ఓ, దేవరాజు , మెడికల్ ఆఫీసర్, పి.లవకుమార్, సూపర్వైజర్, రమణ, స్టాఫ్ నర్స్ సరోజన, ఫార్మసిస్ట్, చంద్రశేఖర్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
Bogatha Waterfall : తెలంగాణలో కనువిందు చేస్తున్న బోగత జలపాతం.. పర్యాటకుల తాకిడి..!









