Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

Srishailam : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి, మరో రెండు రోజులు ఇదే పరిస్థితి..!

Srishailam : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి, మరో రెండు రోజులు ఇదే పరిస్థితి..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది. లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో ఉంది. మరో రెండు రోజులపాటు కూడా ఇదే విధంగా వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉంది.

కర్ణాటకలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం రోజురోజుకు పెరుగుతుంది. శ్రీశైలం జలాశయానికి 1,50,000 క్యూసెక్కుల నీరు చేరుతుంది.

శ్రీశైలం జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 846 అడుగులకు చేరింది. శ్రీశైలం ఎగువన ఉన్న ఆల్మట్టి డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 123.081 టీఎంసీలకు గాను 98. 810 టీఎంసీలను నిల్వ ఉంచారు. 1,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టికి ఇంకా 1,15,45 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది.

నారాయణపూర్ డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 33.373 టీఎంసీలకు గాను 27.767 టీఎంసీల నిల్వ ఉంది. 27 గేట్ల ద్వారా 1,44,250 క్యూసెక్కులన్నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టుకు 1,59 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది.

అదేవిధంగా జూరాల ప్రాజెక్టుకు వర్తిస్తాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను 7.627 టిఎంసిల నీళ్లు నిలువ ఉంది. 37 గేట్లు తెరిచి లక్ష 45 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతోపాటు విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,83,361 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

ఇవి కూడా చదవండి : 

BREAKING : నల్గొండలో అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ ఆత్మహత్య..! 

DRUGS : మధ్యప్రదేశ్ టు హైదరాబాద్ డ్రగ్స్..!

BUDGET 2024: మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం, వ్యవసాయం, గృహ నిర్మాణ రంగాలకు కేటాయింపులు, ఉద్యోగాలకు భారీ ప్రోత్సాహం.. బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు

మరిన్ని వార్తలు