జిల్లా వార్తలుBreaking Newsఖమ్మం జిల్లాతెలంగాణ

వానరం కు అంత్యక్రియలు చేసిన ముస్లిం కుటుంబం..!

వానరం కు అంత్యక్రియలు చేసిన ముస్లిం కుటుంబం..!

నేలకొండపల్లి, మన సాక్షి:

మండలం లోని రాజేశ్వరపురం లో వానరం చనిపోతే … అక్కడ ఆ ముస్లిం కుటుంబం ఉంటుంది. దానికి అంత్యక్రియలు సొంత ఖర్చులో నిర్వహిస్తారు. వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం లోని రాజేశ్వరపురం కు చెందిన షేక్ అబ్బాస్ ఆలీ, బీయమ్మ, యాకోబీ లతో పాటు వారి కుటుంబ సభ్యులు అంతా వానరం సేవలో తరిస్తారు. గ్రామంలో బుధవారం వానరం చనిపోయింది.

వెంటనే గ్రామస్తులు సమాచారం అందిస్తే వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. సొంత ఖర్చులతో ఆటోలో గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తారు. అనంతరం అంత్యక్రియలు చేపడుతారు. ఇలా గ్రామంలో మొత్తం 12 వానరాలు చనిపోతే అంత్యక్రియలు చేశారు. ప్రస్తుతం కోదాడలో ఉంటున్నప్పటికీ గ్రామంలో చనిపోయిన విషయం చెబితే కుటుంబం అంతా వచ్చి అంత్యక్రియలు చేశారు. వీరిని గ్రామస్తులు అభినందించారు.

మరిన్ని వార్తలు