District Sp : నారాయణపేట జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు.. ప్రకటించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!
District Sp : నారాయణపేట జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు.. ప్రకటించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల ( ఆగస్టు 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని నారాయణపేట జిల్లా ఎస్పీ. యోగేష్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున పోలీసు అధికారులకు ముందస్తు అనుమతి లేకుండా జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిదులు, వివిధ సంఘాలు ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపినారు.
అలాగే ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా మరియు ప్రజా ధనానికి, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ హెచ్చరించారు. కాబట్టి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని ఎస్పీ తెలిపినారు. ఎలాంటి అనుమతి లేకుండా ధర్నాలు సభలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎస్పీ తెలిపారు.
ALSO READ :
Telangana : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం..!
BREAKING NALGONDA : భూ తగాదాలలో కర్రలు, రాడ్లతో పరస్పర దాడులు.. 14 మందిపై కేసు..!
Ration Cards : కొత్త రేషన్ కార్డులపై క్యాబినెట్ కీలక నిర్ణయం.. సబ్ కమిటీ ఏర్పాటు..!









