TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్

Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు.. వీరంతా అనర్హులేనా..?

Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు.. వీరంతా అనర్హులేనా..?

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో పదేళ్లుగా పేదలు కనీసం రేషన్ కార్డుకు కూడా నోచుకోలేదు. ఎన్నో పర్యాయాలు రేషన్ కార్డుల ప్రక్రియ మొదలవుతుందని ఆశపడి భంగపడ్డారు. ఎంతో మంది కుటుంబాలు రేషన్ కార్డులు కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది.

దాంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు కసరత్తు నిర్వహిస్తుంది.  ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రారంభమయ్యాయి. మరిన్ని పథకాలు కూడా ప్రారంభించేందుకు సిద్ధమైంది. అన్నింటికీ కూడా రేషన్ కార్డు ని ప్రామాణికంగా తీసుకోనున్నారు.

రేషన్ కార్డు లేని పేదలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డును అందించాలని నిర్ణయించింది. రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డును కూడా అందించేందుకు కసరత్తు నిర్వహిస్తుంది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు గాను క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.

క్యాబినెట్ సబ్ కమిటీలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం మేరకు రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులను కూడా జారీ చేయనున్నారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 89.90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇటీవల ప్రజా పాలన సందర్భంగా 10 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కాగా మరిన్ని దరఖాస్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకు గాను అర్హులైన పేదలందరికీ కూడా తెల్ల రేషన్ కార్డును అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది.

ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా అనర్హులకు కూడా తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఆస్తులు, బంగ్లాలు, కార్లు ఐటి చెల్లించే వారికి కూడా తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కాగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేసేముందు పాత రేషన్ కార్డుల వెరిఫికేషన్ కూడా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

పాత రేషన్ కార్డులలో అనర్హులను తొలగించి కొత్త రేషన్ కార్డుల జారీలో అర్హులను చేర్చే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డులకు సొంత బంగాళా, కారు, ఐటి చెల్లించే వారికి తెల్ల రేషన్ కార్డు వచ్చే అవకాశాలు లేవు. నిజమైన పేదలకే తెల్ల రేషన్ కార్డులు రానున్నాయి.

ఇవి కూడా చదవండి : 

Nagarjunasagar : నాగార్జునసాగర్ కు 4.19 లక్షల క్యూసెక్కుల వరద.. గేట్లు ఎత్తేందుకు అధికారులు ఆప్రమత్తం..!

రెండేళ్ల తర్వాత ఆయకట్టులో సాగు.. ఆనందంలో రైతులు..!

Nagarjunasagar : సాగర్ ఆయకట్టు రైతులకు శుభవార్త.. ఎడమ కాలువకు నీటి విడుదల..!

మరిన్ని వార్తలు