Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsక్రీడలుజిల్లా వార్తలుహైదరాబాద్

Gold Medals : అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్షిప్.. పోటీలో విద్యార్థులకు బంగారు పతకాలు..!

Gold Medals : అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్షిప్.. పోటీలో విద్యార్థులకు బంగారు పతకాలు..!

నాచారం, మన సాక్షి :

హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జులై 21 నుండి నిర్వహించిన అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్షిప్ లో దక్కన్ స్ప్రింగ్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అత్యున్నత ప్రతిభ ప్రదర్శించారు. భారతదేశం పాటు శ్రీలంక నేపాల్ థాయిలాండ్ వంటి ఇతర దేశాల నుండి 3000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.

అండర్ టెన్ విభాగంలో దక్కన్ స్ప్రింగ్ స్కూల్ విద్యార్థులు బాలుర విభాగంలో ఆయుష్ బంగారు పథకాన్ని సాధించగా బాలికల విభాగంలో లక్ష్మీ ఆరాధ్య బంగారు పతకాన్ని సాధించిందని పాఠశాల ప్రిన్సిపాల్ సుమా మీనన్ తెలిపారు.

సినిమా హీరో సుమన్, ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ లు వీరికి బహుమతులు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ నవనీత రావు, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ కుమార్ లు విద్యార్థులని అభినందించారు. తమ పాఠశాలలో విద్యు తో పాటు క్రీడలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.

ప్రతిభను పెంపొందించడంతో పాటు విద్యార్థులు చదువుకు మించి రాణించేలా అవకాశాలను కల్పించడంలో పాఠశాల నిబద్ధతకు ఇది నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్ హెడ్స్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

Fack currency : జోరుగా నకిలీ నోట్లు చలామణి.. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠా..! 

Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు.. వీరంతా అనర్హులేనా..?

Nagarjunasagar : నాగార్జునసాగర్ కు 4.19 లక్షల క్యూసెక్కుల వరద.. గేట్లు ఎత్తేందుకు అధికారులు ఆప్రమత్తం..!

మరిన్ని వార్తలు