Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డి

District collector : నీటి గుంటల్లో ఆయిల్ బాల్స్ వదిలిన జిల్లా కలెక్టర్..!

District collector : నీటి గుంటల్లో ఆయిల్ బాల్స్ వదిలిన జిల్లా కలెక్టర్..!

రాజేంద్రనగర్, మనసాక్షి :

ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలలో మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ శశాంక పేర్కొన్నారు.
స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం లో భాగంగా గురువారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలోని పి & టీ కాలనీ వై జంక్షన్ వద్దు నిర్వహించిన వన మహోత్సవానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అతిధిగా హాజరై మేయర్ లతా ప్రేమ్ గౌడ్ తో కలిసి మొక్కలు నాటారు.

అనంతరం లార్డ్స్ కళాశాల రోడ్లో ఉన్న నీటి గుంతలో ఆయిల్ బాల్స్ వదలారు. అదేవిదంగా దోమ లార్వా నశించుటకు టెమిఫాస్ స్ప్రే చేయడాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ప్రతి ఒక్కరు స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.

ప్రతి ఒక్కరి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్తలు వహించాలని సూచించారు. రాబోయే భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ…. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నామని ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయడమే కాకుండా పరిసరాల పరిశుభ్రత పై అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నమని తెలిపారు.

అందరు మొక్కలు నాటి సంరక్షిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.కార్యక్రమంలో కమీషనర్ శరత్ చంద్ర, 7 వ డివిజన్ కార్పొరేటర్ పద్మావతి పాపయ్య,డీ ఈ ఈ యాదయ్య, ఎ ఈ ఈ రాజ్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేష్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ALSO READ : 

Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. 50 కంపెనీలతో మెగా జాబ్ మేళ.. టెన్త్ పాస్ అయిన వారికి కూడా అవకాశం..!

Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. రూ.5 కోట్లు అప్పు ఇస్తామని నమ్మించి, 60 లక్షలతో పరార్..!

Good News : ప్రభుత్వం గుడ్ న్యూస్.. మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత కుట్టు మిషన్ పథకం, దరఖాస్తు చేసుకోండి ఇలా..!

Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!

మరిన్ని వార్తలు