Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

ACB : ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్..!

ACB : ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్..!

మనసాక్షి, రంగారెడ్డి జిల్లా :

ఏసీబీకి పెద్ద చేప చిక్కింది. ధరణి పోర్టల్ లో మార్పులు చేసేందుకు లంచం తీసుకుంటూ అదనపు కలెక్టర్ ఏసీబీకి దొరికాడు. వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఆయనతో పాటు కలెక్టరేట్ లో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ రెడ్డిని కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ధరణి పోర్టల్ లో నిషేధిత జాబితాలో ఉన్న భూమిని తొలగించేందుకు అదనపు కలెక్టర్ రూ. 8 లక్షల లంచం అడిగారు. కాగా లంచం డబ్బులు కలెక్టరేట్ లో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ద్వారా ఆ డబ్బు తీసుకున్నారు. ఈ విషయంపై ఏసీబీ అధికారులు దాడి చేసి అదనపు కలెక్టర్ ను, సీనియర్ అసిస్టెంట్ ను పట్టుకున్నారు.

ఇదిలా ఉండగా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి నివాసం హైదరాబాద్ లోని నాగోల్ లో కూడా ఏసీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన నివాసంలో 16 లక్షల రూపాయల నగదు తో పాటు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ALSO READ : 

Narayanpet : అక్రమంగా నిల్వ ఉంచిన భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత..!

Cm Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులకు ఎల్ఎస్ గ్రూప్ ఆసక్తి.. త్వరలో రానున్న బృందం..!

Ration Cards : రేషన్ కార్డులపై కీలక నిర్ణయం.. వారి రేషన్ కార్డుల తొలగింపు..!

మరిన్ని వార్తలు