District collector : బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు.. జిల్లా కలెక్టర్..!
District collector : బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు.. జిల్లా కలెక్టర్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
జిల్లా కేంద్రంలోని ఎర్ర గుట్ట వద్ద గల సఖీ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. కేంద్రంలోని స్టాప్ రూమ్, కౌన్సిలింగ్ రూమ్ ను ఆమె పరిశీలించారు.
సఖి కేంద్రం మొదటి అంతస్తులో గల షీ టీం కార్యాలయాన్ని పరిశీలించి, షీ టీం ద్వారా చేపట్టిన కార్యక్రమాలను అక్కడున్న కానిస్టేబుల్ ను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సఖి కేంద్రం మీటింగ్ హాల్ లో సిబ్బందితో మాట్లాడారు. కేంద్రానికి రెగ్యులర్ గా వచ్చే ఫిర్యాదులు – కేంద్రం ద్వారా చూపిన పరిష్కారాల గురించి అక్కడి నిర్వాకులను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా బాల్య వివాహాల నివారణకు చేపడుతున్న చర్యల గురించి ఆమె ఆరా తీశారు. బాల్య వివాహాలను అరికట్టి, వాటిని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత రెండు నెలలుగా ఎన్ని ఫోక్సో కేసులు నమోదయ్యాయని అడిగి తెలుసుకున్నారు. అలాగే లైంగిక వేధింపుల కేసుల వివరాలను పరిశీలించారు. కేంద్రానికి వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని సఖి కేంద్ర నిర్వాహాకులను కలెక్టర్ ఆదేశించారు.
డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ హెల్ప్ లైన్ కు ఎన్ని కాల్స్ వస్తున్నాయని, హెల్ప్ లైన్ కు వచ్చే కాల్స్ ఫిర్యాదులపై అలసత్వం చూపవద్దని తెలిపారు. సఖి, చైల్డ్ ప్రొటెక్షన్ హెల్ప్ లైన్ కు సంబంధించిన జూలై నెల ఫైల్స్ ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం సుభాష్ రోడ్ లో గల బాల సదనాన్ని కలెక్టర్ సందర్శించారు.
బాలసదనంలో ఎంతమంది చిన్నారులు ఉన్నారని ? పాఠశాలకు ఎలా పంపిస్తున్నారనీ అడిగి తెలుసుకున్నారు. బాల సదనంలోని చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. రోజూ ఉదయం ఎన్ని గంటలకు నిద్ర లేస్తారని? నిద్ర లేచిన వెంటనే ఏం వ్యాయామం చేస్తారని? చిన్నారులను అడిగి వారితో కొన్ని ఆసనాలను వేయించారు.
అరుణ్ అనే బాలుడితో ఓ పద్యం చదివించారు. ఊరూ పల్లెటూరు అనే పాటకు, డిజె టిల్లు అనే పాటకు చిన్నారులు చేసిన డాన్స్ ను కలెక్టర్ తిలకించారు. డాన్స్ చేసిన చిన్నారులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. సదనం లోని చిన్నారులకు కరాటే లో శిక్షణ ఇప్పించాలని నిర్వాహకులకు సూచించారు.
చివరగా బాలసదనం చిన్నారులతో కలిసి కలెక్టర్ ఫోటో దిగి చిన్నారులను ఉత్సాహ పరిచారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డి డబ్ల్యు ఓ జయ బాయి, సఖి కేంద్రం నిర్వాహకురాలు క్రాంతి రేఖ, బాలసదనం నిర్వాహకురాలు కవిత పాల్గొన్నారు.
ALSO READ :
Good News : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. సేల్స్ ఎంపోరియం ఏర్పాటు..!
Accident : కారు బోల్తా ముగ్గురుకు గాయాలు..!
Independence day : జెండా పండుగ ఎక్కడ.. సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగురవేసేది అక్కడేనా..!
Ration Cards : రేషన్ కార్డులపై కీలక నిర్ణయం.. వారి రేషన్ కార్డుల తొలగింపు..!









