Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking Newsక్రైం

Accident : కారు బోల్తా ముగ్గురుకు గాయాలు..!

Accident : కారు బోల్తా ముగ్గురుకు గాయాలు..!

రామసముద్రం,  మనసాక్షి

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని ఊలపాడు పంచాయతీ నరసాపురం దగ్గర ఉన్న మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ను డీకొట్టింది. కారులో ఉన్న కిశోరాచారి, నా రాయణాచారి, ఎర్రప్పాచారి ముగ్గురూ స్వల్పంగా గాయపడ్డారు.

వీరిని చికిత్స కోసం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కరెంట్ లేక పోవడంతో ప్రాణపాయం తప్పింది. నరసాపురం గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి సాయపడ్డారు.

ఇవి కూడా చదవండి : 

మిర్యాలగూడ : అమావాస్య, వేప చెట్టు కింద మంత్రించిన కొబ్బరికాయలు, భయాందోళనలు.. రంగంలోకి జన విజ్ఞాన వేదిక..!

వికసించిన బ్రహ్మ కమలం.. పురాణాలు ఏం చెబుతున్నాయి..! 

Krishna Floods : కాసులు కురిపిస్తున్న కృష్ణా నది వరద..!

తల్లిదండ్రుల కష్టానికి ఫలితం.. అన్నా చెల్లెలు కు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు..!

మరిన్ని వార్తలు