Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ

LRS : ఈ నెల 17 నుండి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మోక్షం..!

LRS : ఈ నెల 17 నుండి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మోక్షం..!

నల్లగొండ, మన సాక్షి :

ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ముఖ్యం కలగనున్నది. ఈ మేరకు అధికారులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ నెల 17 నుండి ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని నల్గొండ జిల్లా స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర అన్నారు. బుధవారం ఎల్ ఆర్ ఎస్ పై జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యాయి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్ ఆర్ ఎస్ పై ప్రతి గ్రామపంచాయతీకి ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బృందం లో నీటిపారుదల శాఖ ఏఈ, పంచాయతీ కార్యదర్శి, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు ఉంటారని తెలిపారు.

బుధవారం జిల్లాలోని 15 మండలాల టీములకు శిక్షణ ఇవ్వగా, ఈ నెల 16న 16 మండలాల బృందాలకు ఎల్ఆర్ఎస్ పై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శిక్షణ తీసుకున్న బృందాలు 17వ తేదీన పూర్తిస్థాయిలో పరిష్కారం చేయాలని ఆయన ఆదేశించారు.

జిల్లా పంచాయతీ అధికారి మురళి, ఈ డి ఎం దుర్గ రావ్,డిటిసిపి లక్ష్మి నారాయణ, ఆర్డీవోలు,డి ఎల్ పి ఓ లు,తహసిల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు,ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్లు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు , ఎంపీఓలు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.

ALSO READ : 

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ ఆస్పత్రులపై ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్..!

Runamafi : రుణమాఫీపై మరో కీలక ప్రకటన.. వారి కోసం త్వరలో స్పెషల్ డ్రైవ్..!

Jobs : తెలంగాణలో వెయ్యి పోస్టుల భర్తీ.. జాబ్ క్యాలెండర్ లో ఆ పోస్టులు..!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే టిసి ఉద్యోగాలు, 11,250 ఖాళీలు..!

మిర్యాలగూడ : ఆవిష్కరణకు సిద్ధమైన 100 అడుగుల జాతీయ జెండా..!

మరిన్ని వార్తలు