TOP STORIESBreaking Newsజాతీయం

ఎండలు, ఉక్కపోత ఎందుకో తెలుసా.. వాతావరణశాఖ బిగ్ అప్డేట్..!

ఎండలు, ఉక్కపోత ఎందుకో తెలుసా.. వాతావరణశాఖ బిగ్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రత పెరగడంతో పాటు ఉక్కపోతతో హైరానా అవుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయంపై వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ తెలియజేసింది. అదేంటో తెలుసుకుందాం..

రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా గత వారం రోజులుగా సాధారణ కంటే మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో తేమశాత పెరగడంతో ఎండ వేడి కూడా భారీగా పెరిగింది. వేసవి మాదిరిగానే ఎండల తీవ్రత పెరిగింది. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరికొద్ది రోజులు కూడా ఇదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు పైగానే నమోదు అవుతున్నాయి.

ఉక్కపోత ఎందుకంటే..?

వాతావరణంలో వచ్చే మార్పులు ఆరోగ్యాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో అల్పపీడనం ఉపరితలావర్తనం ఏర్పడుతుంది. దాంతో వాతావరణం చల్లబడుతుంది. కానీ ఈ వారం రోజులుగా ఇలాంటి పరిస్థితులు లేకపోవడంతో ఎండల తీవ్రత పెరిగింది.

మరి కొద్దిరోజులు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావం బలహీనంగా ఉండడంతో ఎండల తీవ్రత అధికమైంది. కోస్తా ప్రాంతంలో మరింత ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాలలో సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.

క్లిక్ చేసి ఇవి కూడా చదవండి : 

Rythu : రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్.. గాంధీ జయంతి నుంచి అమలు..!

Cm Revanth Reddy : మీకు రుణమాఫీ కాలేదా.. ఐతే రేవంత్ శుభవార్త..!

Independence Day : ఢిల్లీ లోని ఎర్రకోట వేడుకల్లో మన గురుకుల విద్యార్ధిని.. అరుదైన గౌరవం..!

మీకు జీరో కరెంటు బిల్లు రావట్లేదా.. అయితే వారికోసం ఓ గుడ్ న్యూస్..!

 

మరిన్ని వార్తలు