Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

Dharani : కాసుల పంట.. ధరణి పెండింగ్ కేసులు..!

Dharani : కాసుల పంట.. ధరణి పెండింగ్ కేసులు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

గత ప్రభుత్వ హయాంలో భూముల క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ ఇప్పుడు అధికారులకు కాసులు కురిపిస్తుంది. ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిన నాటి నుంచి కూడా అనేక భూములు వివిధ కారణాలతో పెండింగ్ లో ఉన్నాయి.

వాటిని పరిశీలించి క్లియర్ చేయాలని రైతుల నుంచి అనేక వినతులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగారు. అయినా కూడా దరఖాస్తులు పెండింగ్ లోనే ఉంచారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని… ఆ.. స్థానంలో మరో పోర్టల్ తీసుకొస్తామని పేర్కొన్నది. దాంతో పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులు అన్నింటిని పరిష్కరించి మరో పోర్టల్ ఏర్పాటు చేయనున్నారు.

అందుకు గాను మరోసారి ధరణి పెండింగ్ దరఖాస్తుదారులంతా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇది ఆసరాగా చేసుకున్న రెవెన్యూ అధికారులు కాసులు దుడుకుంటుంన్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నందున… కిందిస్థాయి ఉద్యోగులకు, ధరణి పోర్టల్ నిర్వాహకులకు కాసుల పంట కురుస్తుందని చెప్పనక్కర లేదు.

ACB కి చిక్కిన అదనపు జిల్లా కలెక్టర్ (ఫైల్ ఫోటో)

 

ఇటీవల రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రూ. 8 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్ స్థాయి అధికారే ధరణి పెండింగ్ లో ఉన్న దరఖాస్తును పరిష్కరించడానికి లంచం తీసుకుంటుండగా.. కిందిస్థాయి అధికారులు ఏ పాటి లంచాలు తీసుకుంటున్నారో చెప్పనక్కరలేదు.

ఒక్కో సమస్యకు ఒక్కో ధర :

ధరణి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులలో ఒక్కొక్క రైతుది ఒక్కొక్క సమస్యగా ఉంది. కొంతమంది పేర్లు తప్పు రావడం, మరి కొంతమంది రైతులవి సర్వే నెంబర్లు తప్పుగా రావడం, మరి కొంతమంది రైతులవి ఉన్న భూమికి తక్కువగా నమోదు కావడం, మరి కొంతమంది రైతులవి ప్రొహిబిటెడ్ భూములుగా నమోదు కావడం..

ఇలా ఒక్కొక్క రైతుది ఒక్కొక్క సమస్యగా ఉంది. దాంతో పెండింగ్ దరఖాస్తును పరిష్కరించడానికి సమస్యల అమౌంట్ ఫిక్స్ చేసి కాసులు దండుకుంటున్నట్లు తెలిసింది. డబ్బులు ఇచ్చుకోలేని రైతులవి రిజెక్ట్ కింద నమోదు చేస్తున్నట్లు సమాచారం.

సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారుల నుంచి వస్తున్న ఒత్తిడితోపాటు రైతుల నుంచి కాసులు దండుకుంటున్నట్లు సమాచారం. ధరణి పెండింగ్ కేసుల సమస్యలను పరిష్కరించడంతో పాటు రైతుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న విషయంపై కూడా అధికారులు దృష్టి సారించాలని పలువురు రైతులు పేర్కొంటున్నారు.

ALSO READ : 

Ration Shops : రేషన్ దుకాణాలపై సివిల్ సప్లై అధికారులు ముమ్మర దాడులు..!

Miryalaguda : మిర్యాలగూడలో ప్లాస్టిక్ కవర్ల విక్రయాల నిషేధం అయినట్టేనా.. ఎమ్మెల్యే ఆదేశాలు గాలికి..!

Runamafi : రుణమాఫీ కాని రైతులకు మరో అవకాశం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు