మద్యం మత్తులో బీహార్ కార్మికుడు వీరంగం..!!
మద్యం మత్తులో బీహార్ కార్మికుడు వీరంగం..!!
గొర్రెల కాపరి పై దాడి… తిరగబడ్డ గ్రామస్తులు.
దేహశుద్ధి చేసి క్వారీ నిర్వహాకులకు అప్పగింత
నేలకొండపల్లి, మన సాక్షి :
మద్యం మత్తులో ఓ గ్రానైట్ లో పని చేసే కార్మికుడు వీరంగం సృష్టించాడు. రోడ్డు పై వచ్చే వారికి అడ్డు తగలటం…వారి మీదకు వెళ్లటం హల్చల్ చేశాడు. నేలకొండపల్లి మండలం లోని ఓ గ్రానైట్ క్వారీలో పని చేసే బీహర్ కు చెందిన కార్మికుడు ఆదివారం మద్యం మత్తు లో వీరంగం సృష్టించాడు.
కూసుమంచి-నేలకొండపల్లి ప్రధాన రహదారి పై వచ్చే వారి మీదకు వెళ్లటం, మద్యం మత్తులో కింద పడుతూ.. లేస్తూ….వీరంగం చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించాడు.
కోరట్లగూడెం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గంగయ్య రహదారి వెంట పొలాలలో గొర్రెలను మేపుతుండగా పొలం లోకి వెళ్లి దాడి ‘చేసిండు. తాగిన మైకంలో ఏం చేస్తుందో తెలియని పరిస్థితులలో సదరు వ్యక్తి ఆకారణంగా గొర్రెల కాపరి పై దాడి చేయటంతో ఉలిక్కి పడ్డ బాధితుడు గ్రామంలోకి పరుగులు తీసి గ్రామస్తులకు సమాచారం అందించారు.
ఈమేరకు స్థానికులు వచ్చి దేహశుధ్ధి చేసి కట్టి పడేశారు. సమాచారం అందుకున్న క్వారీ నిర్వహకులు ఘటనా స్థలం కు చేరుకుని కార్మికుడు ను తీసుకెళ్లారు. మొత్తం మీద మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు.
ALSO READ :
Viral video : లంచం డబ్బులు పంచుకున్న ట్రాఫిక్ పోలీసులు.. సిసి టీవీ రికార్డు వైరల్..!
Dharani : కాసుల పంట.. ధరణి పెండింగ్ కేసులు..!
Grama Panchayathi : గ్రామపంచాయతీ ఎన్నికలపై బిగ్ ట్విస్ట్.. మంత్రి పొన్నం వెల్లడి..!
Ration Shops : రేషన్ దుకాణాలపై సివిల్ సప్లై అధికారులు ముమ్మర దాడులు..!









