Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Musi : నిండిన మూసీ.. మూడు గేట్లు ఎత్తి నీటి విడుదల..!

Musi : నిండిన మూసీ.. మూడు గేట్లు ఎత్తి నీటి విడుదల..!

మన సాక్షి , సూర్యాపేట :

నల్లగొండ జిల్లాలోని మూసీ జలాశయం నిండింది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నదికి భారీగా వారద నీరు చేరడంతో జలాశయం నిండింది. దాంతో అప్రమత్తమైన అధికారులు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

మూసి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులకు గాను 643.52 అడుగులకు చేరింది. మూడు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ఎగువ ప్రాంతాలైన ఆలేరు, బిక్కేరు వాగుల వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది.

దాంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసి ప్రాజెక్టు నీటిని సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను ప్రస్తుతం 4.07 టీఎంసీల నీరు నిలువ ఉంది. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో పాటు కుడి, ఎడమ కాలువలకు కూడా సాగునీటిని విడుదల చేశారు.

LATEST UPDATE : 

Gruhajyothi : జీరో కరెంటు బిల్లు రాని వాళ్లకు మరో అవకాశం.. ఇలా చేస్తే సరిపోతుంది..!

Panchayathi Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురూ.. ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల..!

Rythu Barosa : రైతు భరోసా మార్గదర్శకాలు ఫిక్స్.. వారికే పెట్టుబడి సహాయం..!

Miryalaguda : ఆయకట్టులో కూలీల కొరత.. జోరుగా వరినాట్లు..!

అక్కా.. అర్జెంట్, ఫోన్ చేసుకోవాలి.. జర ఫోన్ ఇవ్వవా.. కట్ చేస్తే..!

మరిన్ని వార్తలు