Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయం

Cm Revanth : ఆసక్తికరంగా రాష్ట్ర రాజకీయాలు.. సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు..!

Cm Revanth : ఆసక్తికరంగా రాష్ట్ర రాజకీయాలు.. సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టు ఆదేశాలతో నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.

లోకసభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం బహిరంగ సభలో బీజేపీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వేషన్లను ఎత్తేసేందుకు బిజెపి కుట్రలు చేస్తుందని ఆరోపణలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చబోతున్నారనే కామెంట్ కూడా చేశారు.

దాంతోపాటు దేశాన్ని హిందూ రాజ్యాంగ మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం పిటిషన్ వేశారు.

అయితే కింది కోర్టు అనేక పర్యాయాలు కేసును వాయిదా వేస్తుండడంతో కాసం వెంకటేశ్వర్లు ఇటీవల రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు. దాంతో హైకోర్టు ఆదేశాల మేరకు నాంపల్లి కోర్టు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.

LATEST UPDATE : 

Cm Revanth : ఆ సన్నాసులను నమ్ముకొని రైతులు ఆగం కావద్దు.. హరీష్ రాజీనామా చేయాల్సి వస్తుందనే కొత్త నాటకం..!

Cm Revanth : ఈడి ఆఫీస్ కు సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకో తెలుసా..!

Rythu Barosa : రైతు భరోసా మార్గదర్శకాలు ఫిక్స్.. వారికే పెట్టుబడి సహాయం..!

అక్కా.. అర్జెంట్, ఫోన్ చేసుకోవాలి.. జర ఫోన్ ఇవ్వవా.. కట్ చేస్తే..!

మరిన్ని వార్తలు