MLC KAVITHA : ఎమ్మెల్సీ కవితకు బెయిల్..?
MLC KAVITHA : ఎమ్మెల్సీ కవితకు బెయిల్..?
మన సాక్షి, వెబ్ డెస్క్ :
లిక్కర్ కుంభకోణం కేసులో తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవిత ఉంటున్న సంగతి విజితమే. ఆమె బెయిల్ పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నది. ఈసారి బెయిల్ తప్పకుండా వస్తుందని ఆ పార్టీ నాయకత్వం బలంగా నమ్ముతుంది.
ఆమె ఇటీవల అస్వస్థతకు గురికాగా ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కూడా అందించారు. అనంతరం ఆయన తిరిగి బీహార్ జైలుకు పంపారు. ఆమెకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఆమెకు బెయిల్ వస్తుందని కొంతమంది గులాబీ నేతలు ఢిల్లీ చేరుతున్నట్లు సమాచారం.
మార్చి 15వ తేదీ నుంచి లిక్కర్ కుంభకోణం కేసులో ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. కవిత తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు సుప్రీంకోర్టులో వినిపించనున్నారు. ఈసారి ఆమెకు బెయిల్ వస్తుందని గట్టి నమ్మకంతో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
LATEST UPDATE :
తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!
తెలంగాణలో 10,594 వీఆర్వోల నియామకం.. నోటిఫికేషన్..!
Cm Revanth : పేదలకు సన్న బియ్యంతో పాటు అవి కూడా పంపిణీ.. తేదీ ఫిక్స్..!









