క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

మిర్యాలగూడ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీఎంఆర్ఎఫ్ స్కాం.. అరెస్టుకు సిద్ధమైన సిఐడి..!

మిర్యాలగూడ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీఎంఆర్ఎఫ్ స్కాం.. అరెస్టుకు సిద్ధమైన సిఐడి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

అక్రమ సంపాదన ధ్యేయంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం పనిచేస్తుంది. రోగుల నుంచి అడ్డగోలుగా డబ్బులు దండుకోవడంతో పాటు నకిలీ రోగుల పేరుతో ప్రభుత్వ సొమ్మును కూడా కాజేసిన వైనం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..

మిర్యాలగూడలోని డాక్టర్స్ కాలనీలో ఉన్న రెండు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సీఎంఆర్ఎఫ్ కుంభకోణం జరిగినట్లుగా ఉన్నతాధికారులు గుర్తించారు. వైద్యం చేయకపోయినా వైద్యం చేసినట్లుగా డాక్టర్స్ కాలనీలోని మహేష్ , నవీన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో బిల్లులు డ్రా చేసినట్లు తేలింది.

దాంతో గత ఏప్రిల్ మాసంలో సిఐడి అధికారులు మిర్యాలగూడలోని మహేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నవీన్ స్పెషల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో విచారణ చేపట్టారు. కాగా మహేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో 4.55 కోట్ల రూపాయలు, నవీన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో సుమారు కోటి రూపాయలకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు కొల్లగొట్టారని విచారణలో తేలినట్లు సమాచారం.

దాంతో హాస్పిటల్ యాజమాన్యం హాస్పిటల్ ఎత్తేసి మరో పేరుతో ఆస్పత్రులు నడుపుతున్నారు. వైద్యుల సంతకాలు కూడా ఆసుపత్రి యాజమాన్యమే ఫోర్జరీ పెట్టినట్లుగా కూడా తేలింది. కాగా విచారణ పూర్తి చేసిన అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా నకిలీ రోగుల పేరుతో సీఎంఆర్ఎఫ్ నిధులు కాజేసిన ఆస్పత్రుల యాజమాన్యాన్ని సిఐడి అరెస్టు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

LATEST UPDATE : 

తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!

Rythu Barosa, Runmafi : రైతు భరోసా, పంటల రుణమాఫీ యాప్ తో సమస్యలకు చెక్.. రేపటి నుంచి ఇంటింటికి సర్వే..!

Cm Revanth : పేదలకు సన్న బియ్యంతో పాటు అవి కూడా పంపిణీ.. తేదీ ఫిక్స్..!

తెలంగాణలో 10,594 వీఆర్వోల నియామకం.. నోటిఫికేషన్..!

Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!

మరిన్ని వార్తలు