తెలంగాణBreaking Newsహైదరాబాద్

Praja Palana : తెలంగాణలో మళ్లీ ప్రజా పాలన.. 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ..!

Praja Palana : తెలంగాణలో మళ్లీ ప్రజా పాలన.. 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన దరఖాస్తులను మళ్లీ స్వీకరించనున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల కోసం పేదల నుంచి ప్రజా పాలన నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించింది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్యారంటీ పథకాల కోసం గతంలో ప్రజా పాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. కాగా మరోసారి ప్రజా పాలన నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. 10 రోజుల పాటు ఈ ప్రజా పాలన నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండలాలలో, పట్టణంలోని వార్డులలో ప్రజాపాలన నిర్వహించనున్నారు. ప్రజా పాలనలో ఈసారి కేవలం హెల్త్ కార్డులు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు.

హెల్త్ కార్డులకు, రేషన్ కార్డులకు లింకు లేకుండా అన్ని కుటుంబాల వివరాలను ఈ ప్రజా పాలన కార్యక్రమంలో సేకరించనున్నారు. జారీ చేసే హెల్త్ కార్డు ఆరోగ్యశ్రీ తో పాటు సీఎంఆర్ఎఫ్ నిధులకు కూడా దీనినే ప్రామాణికంగా తీసుకోనున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలలో ఫ్రాన్స్ దేశంలోని విధానాన్ని పరిశీలించారు. కాగా హెల్త్ డిజిటల్ కార్డులను జారీ చేయాలని నిర్ణయించారు.

హెల్త్ కార్డుకు రేషన్ కార్డుతో ఎలాంటి సంబంధం లేకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి రేషన్ కార్డులు , హెల్త్ కార్డులు అర్హులైన వారందరికీ ఇవ్వడమే ఎజెండాగా ప్రజాపాలన నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

LATEST UPDATE : 

HYDRA : హైడ్రా బుల్డోజర్లు జన్వాడ ఫామ్ హౌస్ వైపేనా.. అధికారుల కొలతలు ప్రారంభం..!

తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!

Rythu Barosa, Runmafi : రైతు భరోసా, పంటల రుణమాఫీ యాప్ తో సమస్యలకు చెక్.. రేపటి నుంచి ఇంటింటికి సర్వే..!

Cm Revanth : పేదలకు సన్న బియ్యంతో పాటు అవి కూడా పంపిణీ.. తేదీ ఫిక్స్..!

మరిన్ని వార్తలు