Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డి

HYDRA : అప్పా చెరువులో హైడ్రా కూల్చివేతలు..!

HYDRA : అప్పా చెరువులో హైడ్రా కూల్చివేతలు..!

రాజేంద్రనగర్, మనసాక్షి :

గగన్ పహాడ్ గ్రామంలోని అప్పా చెరువు ఎఫ్. టి. ఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన పదమూడు షెడ్లను హైడ్రా విభాగం శనివారం ఉదయం కూల్చివేస్తున్నారు.

శంషాబాద్ పరిధిలో లో 35 ఎకరాల విస్తీర్ణంలో వున్న గగన్ పహాడ్ చెరువులో అక్రమం నిర్మాణాలు జరుగుతున్నట్లుగా హైడ్రాకు పలు ఫిర్యాదులు రావడంతో దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపారు.

అప్పా చెరువులో మూడు ఎకరాల పరిధిలో అక్రమంగా పదమూడు షెడ్లను నిర్మించినట్లుగా నివేదిక ఇవ్వడంతో హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు, రెవెన్యూ, నీటి పారుదల, మున్సిపల్ విభాగాల ఆధ్వర్యంలో అప్పా చెరువులో అక్రమంగా నిర్మించిన పదమూడు షెడ్ల నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు.

ఈ తొలగింపులతో ఆక్రమణకు గురైన మూడు ఎకరాల చెరువు భూమిని హైడ్రా అధికారులు తిరిగి స్వాధీనం చేసుకొనున్నారు.

LATEST UPDATE : 

Miryalaguda: మిర్యాలగూడలో కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం, విద్యుత్ లేక కమ్ముకున్న చీకట్లు..!

TG News : తెలంగాణలో వర్షాలు.. పాఠశాలలకు సెలవు..!

TG NEWS : తెలంగాణ కాంగ్రెసులో కోల్డ్ వార్..? ఉత్తమ్ సీఎం అవుతారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు..!

నిరుద్యోగులకు శుభవార్త.. 2280 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!

మరిన్ని వార్తలు