అర్ధరాత్రి హైదరాబాదులో దంచి కొట్టిన వాన.. ఈరోజు కూడా భారీ వర్ష సూచన..!
అర్ధరాత్రి హైదరాబాదులో దంచి కొట్టిన వాన.. ఈరోజు కూడా భారీ వర్ష సూచన..!
మన సాక్షి , హైదరాబాద్ :
హైదరాబాద్ నగరంలో బుధవారం అర్ధరాత్రి వర్షం దంచి కొట్టింది. మరోసారి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. బుధవారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైన అతి భారీ వర్షం తెల్లవారుజామున 3 గంటల వరకు కురిసింది.
దాంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్, మల్లెపల్లి, పాతబస్తీ, మాదాపూర్, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్, అమీర్పేట్, కొండాపూర్, చందానగర్, సికింద్రాబాద్, కొంపల్లి, సరూర్ నగర్ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది.
సుమారు ఐదు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నాళాలు పూర్తిగా నిండి పొంగిపొర్లుతున్నాయి. గురువారం కూడా భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో అవసరం లేకుంటే ఇండ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు పేర్కొంటున్నారు.
LATEST UPDATE :
Bigg Boss 8 : బిగ్ బాస్ తెలుగు 8లో.. సోనియా ఎవరో తెలుసా..!
Uthamkumar Reddy : రైతులతో కలిసి ట్రాక్టర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..!
Holidays : ఈ నెలలో ఆ రెండు రోజులు సెలవులు.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!
Real Heroes : రియల్ హీరోస్.. రాత్రి, పగలు కష్టపడి వరదలో చిక్కిన పదిమందిని కాపాడిన పోలీసులు..!









