Nagarjunasagar : నిండుకుండలా నాగార్జునసాగర్.. 24 గేట్లు ఎత్తివేత..!
Nagarjunasagar : నిండుకుండలా నాగార్జునసాగర్.. 24 గేట్లు ఎత్తివేత..!
నాగార్జునసాగర్, మన సాక్షి :
నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువన శ్రీశైలం నుండి వస్తున్న వరద నీరు పెరుగుతూ ఉండడంతో నాగార్జునసాగర్ జలాశయం నుండి 24 గేట్ల ద్వారా దిగువనకు నీటి విడుదల చేస్తున్నారు.
గత రెండు రోజులుగా సాగర్ జలాశయ నీటిమట్టం మూడు అడుగులకు తగ్గడంతో ఎగువ నుండి వస్తున్న వరద నీటితో జలాశయ నీటిమట్టాన్ని పూర్తిస్థాయికి తీసుకువచ్చారు. శ్రీశైలం నుండి సాగర్ కు వస్తున్న వరద నీరు క్రమేనా పెరుగుతూ ఉండడంతో సాగర్ జలాశయం నుండి విడుదల చేస్తున్న నీటి పరిమాణాన్ని శుక్రవారం ఉదయం నుండి పెంచుతూ వచ్చారు.
శుక్రవారం ఉదయం మొదట రెండు గేట్ల ద్వారా నీటి విడుదల చేసిన అధికారులు అనంతరం నాలుగు గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తూ శుక్రవారం రాత్రికి 24 గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి దిగువనకు నీటి ని విడుదల చేస్తున్నారు. 237, 000 క్యూసెక్కుల నీరు సాగర్ కు చేరుకుంటుండగా అంతే నీటిని దిగవనకు విడుదల చేస్తున్నారు.
LATEST UPDATE :
బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?
Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో నేటి నుంచి రూ.10వేలు..!
సింగూరు ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. ఇక రెండు పంటలకు డోకా లేదు..!









