Breaking Newsక్రైంజగిత్యాల జిల్లాతెలంగాణ

Jagityal : అక్రమంగా నిల్వ ఉంచిన భారీగా పిడిఎస్ బియ్యం పట్టివేత..!

Jagityal : అక్రమంగా నిల్వ ఉంచిన భారీగా పిడిఎస్ బియ్యం పట్టివేత..!

జగిత్యాల, (మన సాక్షి) :

జగిత్యాల జిల్లా జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు నమ్మదగిన సమాచారం మేరకు మెట్ పల్లి సీ.ఐ నిరంజన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ తమ సిబ్బంది తో కలిసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిదిలోని వేములకుర్తి గ్రామంలో గల శ్రీ కీర్తన, కీర్తన పౌల్ట్రీ ఫామ్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 108 క్వింటాల్ల పిడిఎస్ బియ్యం ని, రెండు టాటా ఏస్ ఆటోలు స్వాధీనం చేసుకుని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని మెట్ పల్లి సీ.ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

పట్టుబడిన నిందితుల వివరాలు అంకతి రాజలింగం, శ్రీ కీర్తన పౌల్ట్రీ ఫామ్, వేములకుర్తి గ్రామం ,గంగాధర్ ,కీర్తన పౌల్ట్రీ ఫామ్ , వేములకుర్తి గ్రామం,కొండపల్లి ఖాన్ శెట్టి, శాంతినగర్ మేట్ పల్లి , సద్దుల సతీష్, శాంతినగర్ మెట్ పల్లి, హుస్సేన్ (పరారీలో ఉన్న వ్యక్తి)అని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ పేద ప్రజలకు అందకుండా పక్కదారి పట్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలైన అరికట్టేందుకు నిరంతరం నిఘా పెడుతూ స్పెషల్ డ్రైవ్ లు చేస్తూ విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నామని అన్నారు.

పేద ప్రజల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పక్కదారి పట్టించిన, ప్రజల ఆహార భద్రతకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

LATEST UPDATE : 

Miryalaguda : వారిది మహోన్నత త్యాగం, పరిహారంతో పాటు ఉద్యోగం.. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క..!

మిర్యాలగూడ : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం.. దానివల్లనే ప్రభుత్వానికి ఆర్థిక భారం, బట్టి విక్రమార్క వెల్లడి..!

మహిళలకు సువర్ణావకాశం.. దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లో రూ.5 లక్షలు..!

మరిన్ని వార్తలు