క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండపండుగలు

Nalgonda : నిఘా నీడలో శోభాయాత్ర.. నిరంతర పర్యవేక్షణ, నల్గొండలో ట్రాఫిక్ ఆంక్షల..!

Nalgonda : నిఘా నీడలో శోభాయాత్ర.. నిరంతర పర్యవేక్షణ, నల్గొండలో ట్రాఫిక్ ఆంక్షల..!

నల్లగొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లాలో సోమవారం నిర్వహించే గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ అన్ని రకాల ముందస్తు ఏర్పాటు చర్యలు తీసుకుంది అని జిల్లా యస్.పి శరత్ చంద్ర పవర్ తెలిపారు.

జిల్లాలోని అన్ని ప్రధాన రహదారులతో పాటు వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీటివి కెమెరాలతో పాటు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, జిల్లా పోలీసు కార్యాలయానికి అనుసంధానం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.

జిల్లా కేంద్రంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి అధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని గణేష్ విగ్రహాలు, మండపాలకు జియో ట్యాగింగ్ చేసిన పోలీసులు తమకు కేటాయించిన నంబర్లతో శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోనున్నారు.

నల్లగొండ పట్టణ కేంద్రంలోని 9 అడుగుల లోపు విగ్రహాలు నల్లగొండ పట్టణంలోని వల్లభ రావు చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాటు చేయడం జరిగింది.9 అడుగుల పై బడిన విగ్రహాలు 14వ మైలురాయి వద్ద నిమజ్జనం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ నిఘా పెట్టామని తెలిపారు.

సిసిటివి కెమెరాల పర్యవేక్షణ లో శోభ యాత్ర : 

జిల్లాలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారులు, నల్గొండ పట్టణంతో పాటు మిర్యాలగూడ మరియు దేవరకొండ వంటి ప్రధాన పట్టణాలలో గణేష్ నిమజ్జన శోభయాత్రను 24/7 జిల్లా పోలీసు కార్యాలయం కమాండ్ కంట్రోల్ పర్యవేక్షిస్తుంది. జిల్లావ్యాప్తంగా పోలీస్ శాఖ తరపున నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా మా ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన సుమారు 1660 సీసీటీవీ కెమెరాలను ఆయా పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేశామని అన్నారు.

ALSO READ : Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ.. కంటెస్టెంట్స్ వీళ్లే..!

నిమజ్జన ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి 

జిల్లాలోని ప్రధాన నిమజ్జన ప్రాంతాలైన నల్గొండ పట్టణంలోని వల్లభరావు చెర్వు, మూసి రివర్,14 వ మైలు రాయి, మిర్యాలగూడ వాడపల్లి, నాగార్జునసాగర్,దయ్యాలగండి, అడవిదేవులపల్లి,దేవరకొండ కొండబీమనపల్లి,డిండి వద్ద పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి,పోలీసు పికెట్లు ప్లడ్ లైట్లు,క్రేన్లు , ఏర్పాటు చేశామని,నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉన్నారు.

ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్లినా ఐదు నుంచి పది నిమిషాల వ్యవధిలో పెట్రో వాహనాలు, బ్లూకోట్స్, సంబంధిత పోలీసు అధికారులు అప్రమత్తమయ్యేలా ఆన్‌లైన్ విధానంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్

తేది 16 సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రజలు, వాహనదారులకు శోభ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా శోభ యాత్ర నిర్వహించే మార్గం గుండా ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు శోభ యాత్రకు నిర్దేశించిన మార్గం గుండా వెళ్తూ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసు వారికి సహకరించాలి.

16 వ తేదీ సోమవారం రోజున పట్టణ కేంద్రంలోకి వచ్చే ప్రజల కు విజ్ఞప్తి : 

JM గౌడ్ X రోడ్డు హలియ దేవరకొండ వచ్చే వాహనదారులు హైద్రాబాద్ కు ఈద్గా వయ మునుగోడు బై పాస్ మీదిగా మళ్ళించనైనది. హైద్రాబాద్ నుంచి మిర్యాలగూడ వెళ్లే వాహనాలు నార్కట్పల్లి నకేరేకల్ వయా తిప్పర్తి మీదిగా మిర్యాలగూడ మళ్లించనైనది. మిర్యాలగూడ నుంచి హైద్రాబాద్ వెళ్లే వాహనాలు తిప్పర్తి, నకేరేకల్,నార్కట్ పల్లి మీదిగా హైద్రాబాద్ వైపు మళ్లించనైనది.

నిమజ్జన భద్రత కోసం 950 మంది సిబ్బంది

గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా జిల్లా పోలీసు శాఖ బారీ భద్రతను ఏర్పాటు చేసింది. జిల్లాలో ఒక ఎస్పీ, ఇద్దరు ఏ ఎస్పీ , ఆరుగురు డీఎస్పీలు, 28 మంది సీఐలు, 70 మంది ఎస్సైలు, 620 మందికి పైగా ఏఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఏఆర్ సిబ్బంది మరియు 250 మంది ట్రైనీ కానిస్టేబుళ్లు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు.

శోభయాత్ర లో పాల్గొనే భక్తులు పాటించ వలసిన నిబంధనలు.

శోభయాత్ర జరిగే ప్రాంతాలలో యాత్ర జరిగేటప్పుడు ట్రాఫిక్ డైవెర్షన్ ఉంటాయి.కాబట్టి ప్రజలు దానికి అనుకూలంగా సిద్ధం కావాలి.గణపతి విగ్రహాల్ని తీసికొని వెళ్ళే వాహానాలను చెకప్ చేయించుకోవాలి .
మద్యం త్రాగి వాహనాలను నడుపరాదు . మద్యం త్రాగి వాహానాలు నడిపే వారిపై ఆల్కామీటర్ పరీక్షలు జరుపబడును.

ALSO READRunamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. మాఫీ ఎప్పుడంటే, మంత్రి తుమ్మల స్పష్టం..!

మద్యం త్రాగివున్నట్లుయితే వారిపై చర్యలు తీసికొనబడును . డి.జేలకు ఎట్టి పరిస్థితిలో అనుమతి లేదు . టపాకాయలు కాల్చరాదు .మహిళలు , విలువైన వస్తువులు ధరించకుండా ఉంటే మేలు . ఊరేగింపులో చిన్న పిల్లలు తప్పిపోయే అవకాశం ఉంటుంది . కాబట్టి తగు జాగ్రత్తలు తీసికోవాలి . నిమజ్జనం జరిగే ప్రాంతంలో చెరువుల, కాలవల వద్ద చిన్న పిల్లలు అనుమతించబడరు .
ప్రజలు పోలీసులకు సహకరించి శోభాయాత్ర విజయవంతంగా పూర్తి అయేటట్లు చూడాలి.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.

జిల్లాలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నాం. ఇందుకోసం పోలీసు శాఖ ప్రత్యేకంగా నిర్వాహకులకు ఇప్పటికే పలు సూచనలు తెలపడం జరిగింది.ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

LATEST UPDATE : 

FTL : బఫర్ జోన్, FTLలో అక్రమ నిర్మాణాలు చేస్తే తొలగిస్తాం.. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరిక..!

Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 6000 ఉద్యోగాలు భర్తీ..!

TG News : తెలంగాణలో రెండో రోజు రాజకీయ రచ్చ.. నేతల మధ్య మాటల యుద్ధం..!

 

మరిన్ని వార్తలు