ఆదివారం సెలవు.. అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఆరేళ్ల బాలుడు..!
ఆదివారం సెలవు.. అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఆరేళ్ల బాలుడు..!
అర్వపల్లి, మన సాక్షి :
పాఠశాలకు సెలవులు ఉండటంతో అమ్మమ్మ ఇంటికి వచ్చిన పిల్లగాడు లారీ ఢీకొని మృతి చెందిన సంఘటన నాగారం మండలం సూర్యాపేట జనగాం ప్రధాన రహదారి పనిగిరి స్టేజి దగ్గర ఆదివారం సాయంత్రం జరిగింది.
స్థానికులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం సెలవు కావడంతో నల్గొండ నుండి అమ్మమ్మ ఊరైన ప ని గిరి కి తన తండ్రి తో కలిసి వచ్చిన మహమ్మద్ అబు భక్తర్ (6) స్టేజి దగ్గర రోడ్డు దాటేక్రమంలో జనగం సూర్యాపేట ప్రధాన రహదారిపై లారీ ఢీకొని మృతి చెందినట్లు తెలిపారు.
మృతుని తండ్రి మహమ్మద్ అబ్దుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సూర్యాపేట జనగాం 365 ప్రధాన జాతీయ రహదారిపై 15 రోజులకు ఒకసారి ప్రమాదం జరుగుతుంది, ముఖ్యంగా నాగారం పనిగిరి మధ్య ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఎక్కువమంది చదివిన వార్తలు :
Nelakondapally : రైతులకు రూ.10వేల సహాయం.. మంత్రి పొంగులేటి వెల్లడి..!
Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. మాఫీ ఎప్పుడంటే, మంత్రి తుమ్మల స్పష్టం..!
Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 6000 ఉద్యోగాలు భర్తీ..!
Runamafi : రుణమాఫీ కానీ వారికి సర్వే అయ్యిందా.. ఐతే ఖాతాలలోకి మాఫీ సొమ్ము..!









