Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsరాజకీయంసూర్యాపేట జిల్లా

Suryapet : మా ఇద్దరి గురించి అందరూ అనుకునేవి అపోహలే.. ఒకే వేదికపై బద్ధ శత్రువులు..!

Suryapet : మా ఇద్దరి గురించి అందరూ అనుకునేవి అపోహలే.. ఒకే వేదికపై బద్ధ శత్రువులు..!

సూర్యాపేట, మన సాక్షి :

వారిద్దరూ దశాబ్దాల కాలంగా రాజకీయ బద్ధ శత్రువులు… ఇది వారి వారి పార్టీల కార్యకర్తల మాట. కానీ వారు ఒకే వేదికపై ఒకరికి మరొకరికి ఉన్న అనుబంధం చెప్పుకుంటుంటే కార్యకర్తలు ఔరా అనిపించారు.

గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న సంఘటన చూసి ఔర అనిపించేలా ఉంది. అధికార, ప్రతిపక్ష నాయకుల్లో ఇద్దరు మాజీ మంత్రులు కావడం విశేషం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందని కార్యకర్తలు భావిస్తుంటారు. కానీ వారిద్దరు కూడా ఒకే వేదికపై ఒకరికి ఒకరు తమకున్న అనుబంధాల గురించి తేల్చి చెప్పడంతో ఔరా అనిపించింది.

ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయని అనంతరం సాధారణ పరిస్థితుల్లోనే ఉంటామని ఆ నాయకులు తేల్చి చెప్పడంతో కార్యకర్తలు ఆలోచనలో పడటంతో పాటు చెవులు కొరుక్కున్నారు.

ఆ వేదికపై మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట తో తనకు 40 సంవత్సరాల బంధం ఉందని, అందులో జగదీష్ రెడ్డికి తనతో 35 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. మా ఇద్దరి గురించి అందరూ అనుకునేవి అన్ని అపోహలు మాత్రమే అని పేర్కొన్నారు.

మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు కలిసికట్టుగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రేరణతోనే సూర్యాపేట జిల్లా ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే నేను దామోదర్ రెడ్డి ఒకే వేదిక మీదికి రావడం జరిగిందన్నారు.

LATEST UPDATE : 

Ration Cards : పేదలకు ఇక సన్న బియ్యం.. ప్రభుత్వ నిర్ణయం, ఎప్పటి నుంచి అంటే..! 

Ration Cards : కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. విధి విధానాలు.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం..!

Komatireddy : రూ. 2000 కోట్లతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి ఆరు లైన్లుగా విస్తరణ..!

Ration Cards : కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. విధి విధానాలు.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం..!

మరిన్ని వార్తలు