BIG BREAKING : ఆర్ఎంపి చేసిన వైద్యం వికటించి యువకుడు మృతి..!
BIG BREAKING : ఆర్ఎంపి చేసిన వైద్యం వికటించి యువకుడు మృతి..!
లక్షేట్టిపేట్ , (మన సాక్షి)
మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మండలం కొత్త కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బత్తుల మధుకర్ (26) అనే యువకుడు ఆర్ఎంపీ శ్రీనివాస్ చేసిన వైద్యం వికటించి బ్రెయిన్ డెడ్ తో చికిత్స పొందుతూ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తూ రాస్తారోకో చేశారు.
కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం ఇటీవల మధుకర్ కు జ్వరం రావడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు దవఖానలో పరీక్షలు చేయించుకున్నాడు. డెంగ్యూ జ్వరం అని తేలడంతో తన గ్రామానికి వచ్చే ఆర్ఎంపీ వద్ద ఇంజక్షన్ వేసుకున్నారు. ఇంజక్షన్ వేసుకున్న అనంతరం ఒక్కసారి కుప్పకూలిపోయాడు.
కుటుంబ సభ్యులు వెంటనే మంచిర్యాల లోని ప్రవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. వైద్యులు చూసిన తర్వాత అతనికి బ్రెయిన్ లో సమస్య వచ్చిందని వైద్యులు తెలిపారు. వెంటనే సికింద్రాబాద్ లోని ప్రవేట్ హాస్పిటల్ కి తరలించారు. మధుకర్ అప్పటికే కోమాలకు వెళ్లారని తెలిపారు.
వైద్యులు వెంటనే ఐసియు ఉంచి చికిత్స చేశారు. మధుకర్ ది ఓ సాధారణ రైతు కుటుంబం కాబట్టి అక్కడ వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించి చికిత్స అందించారు. వారం రోజుల నుండి ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతూ మంగళవారం మరణించారు.
దీనంతటికీ కారణం ఆర్ఎంపి శ్రీనివాస్ వేసిన ఇంజక్షన్ అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆర్ఎంపి శ్రీనివాస్ పై చట్టరీత్యా చర్యలు తీసుకొని మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని మృతుని యొక్క కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై మంగళవారం రాస్తారోకో చేశారు.
LATEST UPDATE :
-
Rythu Bharosa : రైతు భరోసా నిబంధనలు ఫిక్స్.. ఇక వారికే పెట్టుబడి సహాయం..!
-
Indiramma Gruhalu : తెలంగాణలో పేదలకు మరో శుభవార్త.. వారం రోజుల్లో ఇందిరమ్మ గృహాలు, విధి విధానాలు..!
-
Suryapet : కొడుకు ప్రభుత్వ ఉద్యోగి… కానీ అన్నం పెట్టడంలేదు, జిల్లా కలెక్టర్ ముందు ఓ తల్లి ఆవేదన..!
-
Ponguleti SrinivasReddy : రైతులకు గుడ్ న్యూస్.. వారందరికీ సహాయం, మంత్రి పొంగులేటి వెల్లడి..!









