Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్సంగారెడ్డి జిల్లా

టేక్మాల్ పిఏసిఎస్ చైర్మన్ యశ్వంత్ రెడ్డి పై దాడి..!

టేక్మాల్ పిఏసిఎస్ చైర్మన్ యశ్వంత్ రెడ్డి పై దాడి..!

టేక్మాల్, మన సాక్షి ప్రతినిధి:

మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రాథమిక సహకార సంఘం సొసైటీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సొసైటీ కి సంబంధించిన అవినీతి జరిగిందని కొంతమంది డైరెక్టర్లు పై అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ విషయంపై అధికారులు విచారణ చేపట్టి అవినీతి జరిగిందని సీఈవో వేణుగోపాల్ ను విధుల నుంచి తొలగించారు. ఆ స్థానంలో సొసైటీలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ శివకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం కోసం ప్రాథమిక సహకార సంఘం లో సమావేశం నిర్వహించి తీర్మానం చేయడం జరిగింది.

కొందరు డైరెక్టర్లు మిగతా అంశాలపై కూడా తీర్మానం చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది డైరెక్టర్లు పట్టుబడ్డారు. ఈ క్రమంలో పిఎసిఎస్ చైర్మన్ యశ్వంత్ రెడ్డి వచ్చే సమావేశంలో చర్చిద్దామని చెప్పి సమావేశానంతరం బయటకు వస్తున్న క్రమంలో పిఎసిఎస్ చైర్మన్ యశ్వంత్ రెడ్డి పై పాల్వంచ గ్రామానికి గ్రామానికి చెందిన డైరెక్టర్ పులి సత్యనారాయణ. జంగిడి గళ్ళ భూమయ్య. లు కలిసి బూతు మాటలు తిడుతూ ముఖంపై చేతితో కొట్టగా పెదవి పగిలి తీవ్ర రక్తస్రావం అయింది.

నాపై దాడి చేశారని పిఎసిఎస్ చైర్మన్ యశ్వంత్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన పులి సత్యనారాయణ. చంగిడికల భూమయ్య. ల పై యశ్వంత్ రెడ్డి. సాయిలు. కలిసి తమపై దాడి చేశారని పరస్పరం ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల మేరకు ఇరువురు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాకేష్ తెలిపారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు