Bigg Boss Telugu 8 : ఈ వారం హౌస్ లో ఉండేది ఎవరు.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?
Bigg Boss Telugu 8 : ఈ వారం హౌస్ లో ఉండేది ఎవరు.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?
మన సాక్షి, సినిమా :
బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా నాలుగో వారంలోకి అడుగు పెట్టింది. హౌస్ లో ఎవరికి ఎవరు తక్కువ కాదన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఆటల్లో కూడా బాగా పోటీ నెలకొన్నది. అయితే ఈ వీక్ ఎండింగ్ కావచ్చింది. ఈ వారంలో నామినేషన్ కు వస్తే పృథ్వీరాజ్, సోనియా, ప్రేరణ, ఆదిత్య, నాగమణికంఠ, నైనిక బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు.
అయితే ఈ వారం పూర్తి కావచ్చింది. ఓటింగ్ కూడా పూర్తయింది. దాంతో ఈ వారంలో వీరిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు..? బిగ్‌బాస్ హౌస్ లో కొనసాగేది ఎవరు..? అనే దానిపై ఉత్కంఠ నెలకొన్నది. తాజా సమాచారం మేరకు ఈ వారం ఓటింగ్ లో సోనియాకు తక్కువ ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఈమె న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో సోనియా ఎలిమినేషన్ పై బిగ్ బాస్ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా నిఖిల్, పృథ్వి ఇకనుంచి గేమ్ బాగా ఆడతారు అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. సోషల్ మీడియా ప్రకారం సోనియా ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
MOST READ :
Hydra : హైడ్రా బాధితులకు అండగా ఉంటా.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ప్రకటన..!
Dussehra Bumper Offer : దసరా పండుగ బంపర్ ఆఫర్.. రూ.100కొట్టు మేకను పట్టు, లక్కీ డ్రా..!









