Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంతెలంగాణ

Dsc Result : తెలంగాణ డీఎస్సీ – 2024 ఫలితాలు విడుదల.. రిజల్ట్ కోసం ఈ లింకు క్లిక్ చేసి చూసుకోండి..!

Dsc Result : తెలంగాణ డీఎస్సీ – 2024 ఫలితాలు విడుదల.. రిజల్ట్ కోసం ఈ లింకు క్లిక్ చేసి చూసుకోండి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ డీఎస్సీ – 2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఆయన ఫలితాలు విడుదల చేశారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే.

కాగా ఈ ఏడాది జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. కాగా 2.45 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షల్లో హాజరయ్యారు. కాగా ఫలితాలను అధికారిక వెబ్సైట్ లో పెట్టారు. వాటిని చెక్ చేసుకోవచ్చు. అయితే కేవలం మార్కులు, ర్యాంకు మాత్రమే ఉంటాయి.

ఫలితాల కోసం ఈ లింకు క్లిక్ చేయండి

https://tgdsc.aptonline.in/tgdsc/

జిల్లాల వారీగా మెరిట్ లిస్టును రోస్టర్ ప్రకారం.. సెలెక్టెడ్ లిస్టును జిల్లాల వారీగా డీఈవో లకు అందజేస్తారని అధికారులు పేర్కొంటున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం సాధారణ ర్యాంకింగ్ జాబితా ఆధారంగా రిజర్వేషన్ ప్రకారం 1:1 నిష్పత్తిలో జిల్లాల వారీగా అభ్యర్థులను మెరిట్ జాబితా ప్రకటించే అవకాశం ఉంది.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు