Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్

సూర్యవంశం – చంద్రవంశం రాజుల మేలు కలయిక..!

సూర్యవంశం – చంద్రవంశం రాజుల మేలు కలయిక..!

రామసముద్రం, మనసాక్షి :

హైదరాబాదులోని హోటల్ కత్రియలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆనాటి తరం – నేటితరం -చూడముచ్చటైన ఈ వేడుకలు రాబోయే తరానికి కొత్త సందేశాన్ని అందిస్తూ నూతన దిశగా అడుగులు వేస్తూ మార్గ నిర్దేశాన్ని సూచిస్తూ ” ఉభయ రాష్ట్రాల క్షత్రియ సేవా సమితి ( ఏపీ & టి ఎస్ ) పిలుపునిచ్చింది.

గత సమితి సాధించిన విజయాలను పూస గుచ్చినట్లు మాజీ అధ్యక్షులు పేరిచర్ల నాగరాజు , మాజీ ప్రధాన కార్యదర్శి నడింపల్లి నాని రాజు సేవా సమితి వార్షిక సమావేశంలో మాట్లాడుతూ మన క్షత్రియ సమాజానికి వేగుచుక్క వంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు దేశవ్యాప్తంగా గుర్తించే రీతిలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ- రాష్ట్రపతి ద్రౌపది మురము
అగ్నిజ్వాల అల్లూరిసీతా రామరాజు జయంతి వేడుకల నుండి ముగింపు వేడుకల వరకు జరిగిన అత్యుత్తమమైన విశిష్ట సేవా కార్యక్రమాల గురించి వివరించినప్పుడు సభ్యులు పెద్ద పెట్టును హర్షద్వానాలు చేశారు.

వివిధ రంగాల్లో నిర్వహించిన అనేక సేవా కార్యక్రమాల గురించి వారు వివరించారు . క్షత్రియ సమాజానికి అనేక విధాలుగా సేవలు అందిస్తున్న వారిని ప్రత్యేకంగా సత్కరించారు. కత్రియా హోటల్ అధిపతి దండు శివరామరాజు , కూకట్పల్లికి చెందిన ప్రఖ్యాత కేటరింగ్ సర్వీసెస్ కృష్ణంరాజు ని క్షత్రియ కార్యాలయ సిబ్బందిని ఘనంగా సత్కరించి వారు చేస్తున్న సేవలను సమితి కొనియాడింది.

ఇదే సందర్భంగా ఉభయ రాష్ట్రాలలోను ప్రఖ్యాత గుండె వైద్య నిపుణులు డాక్టర్ డాక్టర్ పూసపాటి రామచంద్ర రాజు ని ఘనంగా సత్కరించారు.తదుపరి ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన నూతన కార్యవర్గాన్ని సభకు పరిచయం చేశారు.

నూతన కార్యవర్గానికి అధ్యక్షులుగా భూపతి రాజు సత్యనారాయణ రాజు ( మైనర్ రాజు) ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ రఘురామరాజు. తదితర కార్యవర్గ సభ్యులను అఖిలభారత క్షత్రియ సేవాసమితి మాజీ ప్రధాన కార్యదర్శి పెనుమత్స రాఘవ రాజు సభకు పరిచయం చేసారు.

ఈ సమావేశంలో గత కార్యవర్గంలో అమూల్యమైన సేవలందించిన అకస్మాత్తుగా కాలం చెందిన యువ క్షత్రియ తేజం నడింపల్లి ప్రదీప్ కుమార్ వర్మ పేరున నెలకొల్పిన ” బంగారు పతకాన్ని అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థికి వారి తండ్రి నడింపల్లి కృష్ణంరాజు ద్వారా అందజేశారు. అదే రీతిలో దేశ ప్రజలకు -క్షత్రియ సమాజానికి విశేష సేవలందించిన ప్రజ్ఞాశాలి డాక్టర్ డివి రాజు పేరున స్థాపించిన బంగారు పతకాలను శ్రీహరి రాజు ద్వారా ఇచ్చారు .

రాష్ట్రంలోని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కొన్ని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ ప్రాంతంలోని క్షత్రియలను రాష్ట్ర సమితి సరిగా గుర్తించటం లేదని ఇటీవలే “బైర్రాజు కుటుంబ సభ్యులచే ప్రారంభించబడిన “ఎస్ టి ఆర్ ఎఫ్ “మాత్రమే తమ డేటాను సేకరించిందని ఈ సభకు తెలియజేశారు.

ఈ సందర్భంలో ఇదే సమావేశంలో పాల్గొన్న ఎస్ టి ఆర్ ఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బాలకృష్ణ రాజు మాట్లాడుతూ తమ సంస్థ సేకరించిన సమాచారాన్ని సమితి అవసరాల కోసం ఎప్పుడు కోరినాఅందరించి ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటుందని సభకు తెలియజేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది క్షత్రియ యువకులుపెద్దలు ఉత్సాహబరిత వాతావరణంలో

ఈ సమావేశంలో పాల్గొని విజయం కావడానికి తోడ్పడ్డారు వారందరు అభినందనీయులు. మన క్షత్రియ సమాజంలోని వారందరికీ తోడ్పడుతున్నఎందరో మహానుభావులు అందరికీ నడింపల్లి సీతారామరాజు వందనములు తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు